మీసం మెలేసిన రామరాజు.. ఈ మూడు రోజులు ఫ్యాన్స్‌కు పండగే.. బ్యాక్ టూ బ్యాక్..

Ram Charan Birth Day: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రామ్ చరణ్.

మీసం మెలేసిన రామరాజు.. ఈ మూడు రోజులు ఫ్యాన్స్‌కు పండగే.. బ్యాక్ టూ బ్యాక్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 26, 2021 | 5:31 PM

Ram Charan Birth Day: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత వెంటనే దర్శకదీరుడు రాజమౌళీ దర్శకత్వంలో మగధీర సినిమా ఒక్కసారిగా రామ్ చరణ్ కెరీర్‏ను మలుపు తిప్పింది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మెగాపవర్ స్టార్ జక్కన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతరామరాజు పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో చేస్తున్నాడు చరణ్. ఇదిలా ఉంటే.. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఇక పుట్టిన రోజు కంటే ముందే అభిమానులు హాడావిడి చేసేస్తున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో హ్యాప్పీ బర్త్ డే రామ్ చరణ్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక శుక్రవారం ఉదయమే అభిమానులు భారీగా చరణ్ నివాసానికి చేరుకున్నారు. వీరిని కలిసేందుకు చరణ్ కూడా ముందుకోచ్చాడు. తన ఇంటి ముందుఉన్న గేట్ మీద నుంచి అభిమానులతో మాట్లాడాడు. ఈ క్రమంలోనే అభిమానుల కోరికమేరకు మీసం తిప్పాడు చరణ్. అనంతరం ఆర్ఆర్ఆర్ మూవీ గురించి ముచ్చటించాడు. శుక్రవారం సాయంత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ కాబోతుందంటూ చెప్పుకోచ్చాడు. అంతేకాదు.. శనివారం రోజున ఆచార్య పోస్టర్ రాబోతుందంటూ చెప్పుకోచ్చాడు. అలాగే మార్చి 28న పవర్ స్టార్ వకీల్ సాబ్ పోస్టర్ తానే విడుదల చేయబోతున్నట్లుగా చెప్పాడు. మార్చి నెల మోస్ట్ స్పెషల్ మంత్ అంటూ.. మార్చి 27 తనది.. మార్చి 28న పవన్ కళ్యాణ్ మూవీ అప్‏డేట్స్ రాబోతున్నాయంటూ చెప్పుకోచ్చాడు. ఆ తర్వాత అభిమానులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

రామ్ చరణ్ ట్వీట్..

రామ్ చరణ్ వీడియో..

రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రెషన్స్..

Also Read:

చేసింది ఒకే సినిమా.. కానీ అవకాశాలు మాత్రం బోలేడు.. నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన యంగ్ హీరో..

నితిన్ ఒప్పుకుంటాడో లేదో అనే సందేహంతోనే కథ చెప్పా.. కానీ.. రంగ్ దే డైరెక్టర్