నితిన్ ఒప్పుకుంటాడో లేదో అనే సందేహంతోనే కథ చెప్పా.. కానీ.. రంగ్ దే డైరెక్టర్
'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'రంగ్ దే'. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ
‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన మూడో చిత్రం ‘రంగ్ దే’. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల అయ్యింది. ఈ సందర్భంగా గురువారం మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రంగ్ దే’కి పనిచేసిన అనుభవం, హీరో హీరోయిన్లు నితిన్, కీర్తి ఎంతగా ఈ కథను నమ్మారనే విషయం, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వ్యవహారశైలి గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు వెంకీ అట్లూరి.
మిస్టర్ మజ్ను’ తర్వాత ఒక క్యూట్ ఫ్యామిలీ మూవీ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. పక్కింటి అబ్బాయి, పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో అలాంటి సినిమా చెయ్యాలనుకున్నప్పుడు అర్జున్, అను పాత్రలు నా మనసులో పుట్టాయి. అలా వచ్చిందే రంగ్ దే. ఈ సినిమాలో లవ్ ఫ్యాక్టర్ కంటే ఎమోషన్ ఫ్యాక్టరే ఎక్కువ ఉంటుంది.నిజానికి నేను ఈ కథ రాసుకున్న తర్వాత మొదట నితిన్‌ను కాకుండా వేరే హీరోలను అనుకున్నాను. ఈ సినిమా చేయడానికి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ముందుకు వచ్చాక, నితిన్ పేరును నిర్మాత నాగవంశీ సూచించారు. నితిన్ ఒప్పుకుంటాడో, లేదోననే సందేహంతోనే నేను కథ చెప్పాను. తను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయడంతో నమ్మలేకపోయాను. కథను ఆయన అంతగా నమ్మాడు. నితిన్, కీర్తి అంతగా ఈ కథను నమ్మడంతో వాళ్ల పాత్రలతో మరింత బాగా ప్రయోగాలు చేయవచ్చనిపించింది. ట్రైలర్ రిలీజ్ చేశాక నా సినిమాలకు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై నా నమ్మకం ఇంకా పెరిగింది.నితిన్ నాకు పదిహేనేళ్లుగా పరిచయం. అందువల్ల నాకు తనతో సెట్స్ మీద చాలా సౌకర్యంగా అనిపించింది. కీర్తి విషయానికి వస్తే, ఆమె వెనుక ‘మహానటి’తో వచ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెండో రోజు నుంచే చాలా కంఫర్ట్ అట్మాస్పియర్‌ను ఆమె క్రియేట్ చేసింది. అలా ఆ ఇద్దరితో చాలా సౌకర్యంగా ఈ సినిమా చేశాను. నా కంటే ఈ సబ్జెక్టును నితిన్, కీర్తి గట్టిగా నమ్మారు. షూటింగ్ జరుగుతున్నంత సేపూ కథ గురించి, సన్నివేశాల గురించి నాతో బాగా డిస్కస్ చేస్తూ వచ్చారు. అర్జున్, అను పాత్రలను వారు బాగా చేశారు అనేకంటే ఆ పాత్రల్లో వాళ్లు బాగా ఇన్‌వాల్వ్ అయ్యారనడం కరెక్టుగా ఉంటుంది.అంటూ చెప్పుకొచ్చాడు వెంకీ .
మరిన్ని ఇక్కడ చదవండి :
‘101 Jillala Andagadu’: బట్టతలతో అవసరాల శ్రీనివాస్.. ఆకట్టుకుంటున్న 101జిల్లాల అందగాడు పోస్టర్..
Allu Arjun: తన ఫెవరేట్ హీరోయిన్ ఎవరో చెప్పిన బన్నీ డాటర్.. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో…