మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్టేనా..? ఇప్పటి వరకూ ప్రిన్స్ వదులుకున్న హిట్ మూవీస్ ఏమిటో తెలుసా.?
మహేష్ బాబు సుకుమార్ తో సినిమా రిజెక్ట్ చేయగా.. అది అల్లు అర్జున్ వద్దకు చేరుకుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న సినిమాలు.. అవి నటించిన హీరోల గురించి..
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా వెండి తెరపై పోరాటం సినిమాతో అడుగు పెట్టాడు మహేష్ బాబు. అనంతరం చాలా సినిమాలు బాలనటుడిగా నటించి తనకంటూ ఫేమ్ సొంతం చేసుకున్నాడు.. హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రిన్స్ గా అమ్మాయిల కలలు రాకుమారుడుగా మారాడు. మహేష్ డిఫరెంట్ సినిమాలల్లో నటిస్తూ సూపర్ హిట్స్ అందుకున్నాడు.. అయితే మహేష్ బాబు కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయగా.. అవి దాదాపు బాక్సాఫీ వద్ద సూపర్ హిట్ సినిమాలే అవ్వడం విశేషం. తాజాగా మహేష్ బాబు సుకుమార్ తో సినిమా రిజెక్ట్ చేయగా.. అది అల్లు అర్జున్ వద్దకు చేరుకుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు వదులుకున్న సినిమాలు.. అవి నటించిన హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!
ఉదయ్ కిరణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిన మనసంతా నువ్వే సినిమా అప్పట్లో ఓ రేంజ్ లో సూపర్ హిట్. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఈ మూవీ యువతిని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి మొదటగా మహేష్ బాబుని హీరోగా నిర్మాత ఎంఎస్ రాజు అనుకున్నారట.. అయితే అప్పటికే ఉదయ్ కిరణ్ నువ్వు నేను తో సూపర్ హిట్ అందుకోవడంతో మహేష్ ప్లేస్ ను రీప్లేస్ చేశారట.
అక్కినేని కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా జోష్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు నాగ చైతన్య.. అయితే తొలిహిట్ ను అందించింది ఏం మాయచేశావే.. సినిమా కు మొదటగా మహేష్ బాబుని హీరోగా అనుకున్నాడట దర్శకుడు గౌతమ్ మీనన్. అయితే కొన్ని అనుకోని కారణాలతో మహేష్ బాబు వదులుకుంటే.. అది నాగచైతన్య వద్దకు చేరుకుంది.. బంపర్ హిట్ అనుకున్నాడు. అందులో హీరోయిన్ గా నటించిన సమంతనే ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. ఇక హిస్టారికల్ మూవీ రుద్రమదేవి లోని గోనగన్నారెడ్డి గా ముందుగా మహేష్ బాబుని అనుకున్నాడు దర్శకుడు గుణ శేఖర్.. అయితే అది కొన్ని కారణాలతో మహేష్ రిజెక్ట్ చేస్తే.. అల్లు అర్జున్ నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ 24. సినిమాలో నటించాడని ముందు మహేష్ ని అడిగాడట.. అయితే మహేష్ అప్పటికే మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో సూర్య వద్దకు చేరుకుంది. ఈ సినిమాలో సూర్య మూడు క్యారెక్టర్లు చేసి వారెవ్వా అనిపించాడు. ఇక కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేయాలనీ దర్శకుడు మురగదాస్ అనుకున్నాడట.. అందుకోసం మహేష్ బాబుని అడిగాడట.. తను నో చెప్పడంతో ఆగిపోయాడట.. అదే స్టోరీ తో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీనెంబర్ 150గా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్దసందడి చేసింది. ఇక అతడు, ఖలేజా వంటి క్రేజీ ప్రోడక్ట్ తో మహేష్ బాబు కి స్పెషల్ ఇమేజ్ ను ఇచ్చిన త్రివిక్రమ్ ముందుగా అ, ఆ సినిమాను మహేష్ తోనే అనుకున్నాడట.. అయితే మహేష్ నో చెప్పడంతో ఆ అవకాశం నితిన్ కు దక్కింది. కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఫిదా బాక్సాపీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమాలో మహేష్ హీరోగా నటించాలని శేఖర్ కమ్ముల అడిగాడట.. అయితే ఆ క్యారెక్టర్ కు తాను సూట్ కాను అంటూ రిజెక్ట్ చేశాడట.. దీంతో వరుణ్ తేజ్ ఆఫర్ అందుకున్నాడు. కెరీర్ లో మరో హిట్ అందుకున్నాడు.
Also Read: పండ్లలో రారాజు.. మామిడి పండు.. దీనిని తింటే బరువు పెరుగుతారా..?