Mango and Weight Gain: పండ్లలో రారాజు.. మామిడి పండు.. దీనిని తింటే బరువు పెరుగుతారా..?

వేసవి వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండు వైపే.. మామిడి పండు తినడానికి పిల్లలు. పెద్దలు మామిడి అంతగా ఇష్టపడతారు. అందుకనే మామిడి పండును పండ్లకు రారాజు..

Mango and Weight Gain: పండ్లలో రారాజు.. మామిడి పండు.. దీనిని తింటే బరువు పెరుగుతారా..?
Mango And Weight Gain
Follow us
Surya Kala

|

Updated on: Mar 26, 2021 | 2:43 PM

Mango and Weight Gain: వేసవి వచ్చిందంటే చాలు అందరి చూపు మామిడి పండు వైపే.. మామిడి పండు తినడానికి పిల్లలు. పెద్దలు మామిడి అంతగా ఇష్టపడతారు. అందుకనే మామిడి పండును పండ్లకు రారాజు అని కూడా అంటారు. రుచిలో అద్భుతమనిపించే మామిడిలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. కాల్షియం, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది మామిడిలో. ఇక మామిడి రుచిలోనే కాదు శరీర సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. వివిధ రుచుల్లో ఆకారాల్లో, సైజుల్లో, రంగుల్లో లభించే మామిడి పండ్లలో ఎన్నో రకాల ఔషధగుణాలు , ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏడాదిలో ఒక్కసారి దొరుకుతాయి.. తినడకుండా ఉంటామా అంటూ కొందరు తెగ లాగించేస్తే.. మరికొందరు.. లావు అయిపోతామేమో అనే భయంతో పక్కన పెట్టేస్తారు.. ఆయితే మామిడిపండు తింటే బరువు పెరుగుతారా అనే విషయంపై న్యూట్రిషనిస్ట్ పలు సూచనలు చేశారు. అవి ఏమిటో చూద్దాం..!

మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, వంటి పోషకాలున్నాయని.. ఇక కేవలం ఒక శాతం కొవ్వును కలిగి ఉందని ఆరోగ్య నిపుణులు చెప్పారు కనుక డైట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మామిడి పండు తినాలా వద్దా అనే విషయంలో భయపడాల్సిన పని లేదు. సో ఈ పండు తినడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశమే లేదని నిపుణులు స్పష్టం చేశారు. అయితే మామిడి పండును భోజనంతో పాటు తినే అలవాటు ఉంటే మాత్రం ఇక నుంచి మనుకోమంటున్నారు. భోజనం తినే సమయంలో కాకుండా మిగతా సమయంలో అదీ రోజుకి ఒక మామిడి పండు మాత్రమే తినమని సూచిస్తున్నారు. అయితే జ్యూస్ ల రూపంలో, మిల్క షేక్, ఐస్ క్రీమ్ ల రూపంలో తీసుకుంటే మాత్రం బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయట. పండుగానే తింటే బరువు పెరగరని నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్న స్త్రీలు .. ప్రాధమిక దశలో గుర్తిస్తే నివారణ సాధ్యం.. లక్షణాలు ఇవే..!

ఏనుగును వెంబడించిన టూరిస్ట్‌లకు షాక్.. ఒక్కసారిగా హడలిపోయారు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..