India vs England 2nd ODI: టీమిండియా తుఫాన్ వేగం.. 50 ఓవర్లలో 336 పరుగులు.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్..
ఇంగ్లాండ్ ముందు టీమిండియా మరోసారి భారీ టార్గెట్‌ను ఉంచింది.పుణేలో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది.
పూణేలో జరుగుతున్న రెండో వన్టేడేలోనూ టీమిండియా తుఫాన్ వేగంతో అదరగొట్టింది. ఆట ప్రారంభంలో కొత్త ఆచితూచి ఆడిన.. ఆ తర్వాత వేగం పెంచారు. ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులను చేసింది కోహ్లీ సేన. అయితే ఓపెనర్లు మొదటి వన్డేలో దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ కూడా 25 పరుగుల చేశాడు. ఆతర్వాత ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన సెంచరీని చేసిన జట్టుకు భారీ స్కోర్ చేసేందుకు తోడ్పడ్డాడు. అతడికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దంచికొట్టాడు. చివర్లో వచ్చిన రిషబ్ పంత్ తుఫాన్ వేగంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో దూకుడు ప్రదర్శించాడు.
రప్ఫాడించిన రాహుల్… వన్డేల్లో అయిదువ సెంచరీ
టీ20లో అంత పెద్దగా ఆడని కేఎల్ రాహుల్ వన్డేల్లో దూకుడు పెంచాడు. ఇంగ్లండ్‌తో పుణెలో జరుగుతున్న రెండవ వన్డేలో చెలరేగిపోయాడు.. సెంచరీతో దుమ్ము రేపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో పూర్తిగా విఫలమైన రాహుల్.. వన్డేల్లో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. తొలి వన్డేలో 43 బంతుల్లో 62 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచిన రాహుల్.. రెండవ వన్డేలో సెంచరీతో తన దమ్మేంటో చూపించాడు. రాహుల్‌కు ఇది వన్డేల్లో అయిదువ సెంచరీ కావడం విశేషం.