AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 2nd ODI : ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్‌ బెన్ స్టోక్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా..

IND vs ENG 2nd ODI : భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇందులో

IND vs ENG 2nd ODI : ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్‌ బెన్ స్టోక్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. ఎందుకో తెలుసా..
Ind Vs Eng 2nd Odi
uppula Raju
|

Updated on: Mar 26, 2021 | 4:16 PM

Share

IND vs ENG 2nd ODI : భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇందులో భాగంగా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సెలైవా ఉపయోగించడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నిబంధనల ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో సెలైవా ఉపయోగించడం నిషేధం. ఒకవేళ ఎవరైననా ఈ రూల్స్‌ అతిక్రమిస్తే మొదటిసారి హెచ్చరిస్తారు. రెండోసారి కూడా ఇలానే చేస్తే ఆ ఆటగాడు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టుకు ఐదు పరుగుల జరిమానా విధిస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో బంతిని షైన్‌చేసే క్రమంలో బౌలర్లు లాలాజలం(సెలైవా) ఉపయోగిస్తారు. అయితే ఈ అంశంపై నిబంధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

నాలుగో ఓవర్‌ రెండో బంతి వేసిన తర్వాత బాల్‌ను తీసుకున్న స్టోక్స్‌ సెలైవా అప్లై చేశాడు. దీంతో అంపైర్‌ వీరేందర్‌ శర్మ అతడికి వార్నింగ్‌ ఇచ్చాడు. అంతేగాక విషయాన్ని తాత్కాలిక కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు తెలియజేశాడు. కాగా ఈ ఘటన అనంతరం బంతిని సానిటైజ్‌ చేశారు. ఇక టీమిండియా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. మొదటి వన్డేలో భుజం గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగిన శ్రెయాస్‌ అయ్యర్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ మోర్గాన్‌ గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరమవడంతో అతని స్థానంలో జాస్‌ బట్లర్‌ నాయకత్వం వహించనున్నాడు.

IND vs ENG 2nd ODI Live: ఆచి తూచి ఆడుతున్న టీమిండియా..

మీసం మెలేసిన రామరాజు.. ఈ మూడు రోజులు ఫ్యాన్స్‌కు పండగే.. బ్యాక్ టూ బ్యాక్..

Ram Charan-RRR Update: రామరాజు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

Surat Business Man : చంద్రుడిపై ఎకరం స్థలం కొనుగోలు చేసిన సూరత్ వ్యాపారి.. ఎలా విక్రయించాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..