Post Office Savings Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. నెలకు రూ.10 వేల డిపాజిట్‌తో రూ.16 లక్షల బెనిఫిట్‌

పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో పన్ను ఆదా పథకంతో పాటు రుణ పథకం సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సురక్షితమైన..

Post Office Savings Scheme: పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. నెలకు రూ.10 వేల డిపాజిట్‌తో రూ.16 లక్షల బెనిఫిట్‌
Post Office Scheme
Follow us

|

Updated on: Dec 11, 2022 | 9:09 AM

పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో పన్ను ఆదా పథకంతో పాటు రుణ పథకం సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సురక్షితమైన పెట్టుబడితో మంచి లాభాలను సంపాదించడానికి మీరు పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మీరు ప్రతి నెలా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఉత్తమ పథకం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ అనేది ఒక ప్రసిద్ధ పథకం. ఇందులో పెట్టుబడిని కేవలం రూ.100 నుంచి ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం 5.80 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇది ఏప్రిల్ 2020 నుండి వర్తిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం కింద భారతీయ పౌరుడు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు.

వడ్డీ ఎలా లెక్కించబడుతుంది

పోస్టాఫీసు యొక్క RD పథకంలో ప్రతి నెలా వడ్డీ అందుతుంది మరియు ఈ వడ్డీ మూడు నెలల తర్వాత కాంపౌండ్ రేటుతో మీ ఖాతాలో జమ చేయబడుతుంది. మీరు ఈ పథకం కింద డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటే, మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి డిపాజిట్ చేయవచ్చు.

ప్రతి నెలా 10 వేల రూపాయల పెట్టుబడి:

పోస్టాఫీసు ఆర్డీ పథకం కింద ఒక ఖాతాదారుడు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడుతూ ఈ పెట్టుబడిని 10 సంవత్సరాల పాటు చేస్తే అతను మొత్తం 16 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటాడు. అలాగే ప్రతి నెలా 10 వేలు డిపాజిట్ చేస్తున్నారంటే ఏడాదికి లక్షా 20 వేల రూపాయలు అవుతుంది. అదేవిధంగా 10 సంవత్సరాలలో మీకు సుమారు 12 లక్షల డిపాజిట్ ఉంటుంది. మరోవైపు వడ్డీ రూపంలో 4 లక్షల 26 వేలకు పైగానే రాబడి వస్తుంది. అంటే ఈ పథకంలో 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసే వారికి రూ.16 లక్షల కంటే ఎక్కువ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఇతర ప్రయోజనాలు:

ఈ పథకం కింద 18 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా డబ్బును డిపాజిట్ చేయవచ్చు. కానీ మైనర్‌ పిల్లలు ఉంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఈ పథకంలో డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత దానిపై రుణ సౌకర్యం కూడా పొందవచ్చు. మొత్తం డిపాజిట్ మొత్తంలో 50% రుణంగా తీసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.