Fact Check: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాల కోసం రూ.2000 రుసుము చెల్లించాలా? ఇందులో నిజమెంత?

ఎప్పటికప్పుడు దేశంలోని ప్రతి వర్గానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఈ పథకాల లక్ష్యం దేశంలోని ప్రతి వర్గాల ప్రజలకు సహాయం చేయడమే. కరోనా మహమ్మారి..

Fact Check: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణాల కోసం రూ.2000 రుసుము చెల్లించాలా? ఇందులో నిజమెంత?
Pm Mudra Yojana
Follow us

|

Updated on: Dec 11, 2022 | 8:08 AM

ఎప్పటికప్పుడు దేశంలోని ప్రతి వర్గానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తూనే ఉంటుంది. ఈ పథకాల లక్ష్యం దేశంలోని ప్రతి వర్గాల ప్రజలకు సహాయం చేయడమే. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అటువంటి పరిస్థితిలో ప్రజలకు సహాయం చేయడానికి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ పథకాన్ని తీసుకువచ్చింది. దీని కింద ప్రజలకు రుణాలు అందజేస్తుంది. ఈ పథకం కింద, మీరు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు వ్యాపార రుణం తీసుకోవచ్చు. ఈ పథకం యువత కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై ఓ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’ కింద రూ.10 లక్షల వరకు గ్యారెంటీ లేని రుణం కావాలంటే రుసుముగా రూ.2,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఈ వైరల్‌ అవుతున్న లేఖ సారాంశం. ప్రభుత్వం ఈ రుసుమును లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజుగా తీసుకుంటోంది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ వైరల్ క్లెయిమ్‌ను తనిఖీ చేసింది. ఈ దావా పూర్తిగా తప్పు అని గుర్తించింది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణం తీసుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి రుసుమును వసూలు చేయదని, ఈ వార్త పూర్తిగా నకిలీదని ఫాక్ట్‌ చెక్‌ వివరించింది.

ఇవి కూడా చదవండి

ఈ క్లెయిమ్ పూర్తిగా ఫేక్ అని పీఐబీ ఫాక్ట్ చెక్ తెలిపింది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. పీఎం ముద్రా లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం లోన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ ఫీజు అని ఎటువంటి రుసుమును వసూలు చేయదని గుర్తుంచుకోండి. వైరల్ అవుతున్న QR కోడ్‌లో డబ్బు పంపితే మీరు మోసానికి గురవుతారు. అటువంటి మోసాల పట్ల పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. దీనితో పాటు రుణం పొందడానికి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది.

ప్రజలు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి ముద్రా యోజన కింద కేంద్ర ప్రభుత్వం రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ప్రభుత్వం ఈ రుణాన్ని మొత్తం మూడు కేటగిరీల్లో ఇస్తుంది. మొదటి శిశు రుణం రూ.50,000 వరకు రుణం. అదే సమయంలో కిషోర్ రుణం రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు లభిస్తుంది. మరోవైపు తరుణ్ లోన్ లో ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..