PAN Card: పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయలేదా.? మీ పాన్‌ పనిచేయదు చూసుకోండి. చివరి తేదీ ఎప్పుడంటే..

పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ గడువు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం ఫైన్‌ చెల్లించి లింక్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆధార్‌తో పాన్‌ను లింక్‌ చేయడానికి..

PAN Card: పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయలేదా.? మీ పాన్‌ పనిచేయదు చూసుకోండి. చివరి తేదీ ఎప్పుడంటే..
Pan And Aadhar Link
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 11, 2022 | 7:48 AM

పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ గడువు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం ఫైన్‌ చెల్లించి లింక్‌ చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆధార్‌తో పాన్‌ను లింక్‌ చేయడానికి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఫైన్‌తో లింక్‌ చేసే సదుపాయం సైతం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మరోసారి వినియోగదారులను అలర్ట్‌ చేసింది. గడువు తేదీలోగా ఆధార్‌తో లింక్‌కాని పాన్‌కార్డులు పనిచేయనవి తెలిపింది. ఫైన్‌తో కూడిన గడువు ముగిసేలోగా లింక్‌ చేసుకోవాలని సూచించింది.

ఒకవేళ మార్చిన 31నాటికి కూడా ఆధార్‌తో పాన్‌ను లింక్‌ చేసుకోకపోతే 2023 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి పాన్‌కార్డ్‌ నిరుపయోగం అవుతుంది. భవిష్యత్‌ అవసరాలకు పాన్‌ కార్డును ఉపయోగించుకోలేరు. దీంతో బ్యాంక్‌ ఖాతాలు, డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ చేయలేరు. ఐటీ రిటర్న్‌లు ఫైల్‌ చేయలేరు. బ్యాంకుల్లో రూ. 50 వేలకి మించిన ట్రాన్సాక్షన్స్‌ చేయలేరు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పాన్‌, ఆధార్‌ లింక్‌ చేయాలనుకునే వారు ముందుగా జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మీ పాన్‌ లింక్‌ అయ్యిందో లేదో ఇలా తెలుసుకోండి..

మీ పాన్‌, ఆధార్‌తో లింక్‌ అయ్యిందో లేదో అన్న అనుమానంతో ఉన్నారా. అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక ఆప్షన్‌ ఉంది. ఇందు కోసం ముందుగా ఈ వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం పాన్‌ కార్డ్ నెంబర్‌ను పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి చివరిగా క్యాప్చా కోడ్‌ను ఇవ్వాలి. దీంతో మీ పాన్‌ కార్డు, ఆధార్‌తో లింక్‌ అయ్యిందో లేదో సింపుల్‌గా తెలిసిపోద్ది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..