Digital payments: డిజిటల్‌ పేమెంట్స్‌లో హైదరాబాదీల దూకుడు.. దేశంలోనే రెండో స్థానంలో..

దేశంలో ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ అందుబాటులోకి రావడం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్ ఇండియా క్యాంపెయినింగ్ చేపట్టడంతో డిజిటల్‌ ఎకానమీవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు...

Digital payments: డిజిటల్‌ పేమెంట్స్‌లో హైదరాబాదీల దూకుడు.. దేశంలోనే రెండో స్థానంలో..
Digital Payments
Follow us

|

Updated on: Dec 11, 2022 | 8:27 AM

దేశంలో ప్రస్తుతం డిజిటల్‌ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ అందుబాటులోకి రావడం, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డిజిటల్ ఇండియా క్యాంపెయినింగ్ చేపట్టడంతో డిజిటల్‌ ఎకానమీవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ లావాదేవీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే డిజిటల్‌ చెల్లింపుల్లో హైదరాబాద్‌ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య డిజిటల్‌ ట్రాన్సక్షన్స్‌లో దేశంలోనే హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది.

వరల్డ్‌ లైన్‌ ఇండియా తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇక ఈ పది నెలల్లో వరల్డ్‌ లైన్‌ ప్రాసెస్‌ చేసిన డిజిటల్‌ లావాదేవీల ప్రకారం బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హైదరాబాద్‌ నిలవగా తర్వాత స్థానాల్లో చెన్నై, ముంబై, పుణెలు ఉన్నాయి. 10 నెలల సమయంలో హైదరాబాద్‌లో కోటికిపైగా డిజిటల్‌ లావాదేవీలు జరగడం విశేషం. వీటి విలువ దాదాపు రూ. 3 వేల కోట్లకుపైగా కావడం విశేషం.

ఈ సర్వేను పలు వ్యాపార సంస్థల్లో జరిగిన డిజిటల్‌ లావాదేవీల ఆధారంగా నిర్వహించారు. ముఖ్యంగా పండుగ సీజన్‌ విక్రయాలు, పెరిగిన వినియోగ సామర్థ్యం డిజిటల్‌ చెల్లింపులను మరింత పెంచాయని వరల్డ్‌ లైన్‌ ఇండియా అభిప్రాయపడింది. ఈ కామర్స్‌ సైట్స్‌ డిజిటల్ చెల్లింపులకు ఊతమిచ్చాయి.  రానున్న రోజుల్లో డిజిటల్ చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రతీ త్రైమాసికంలో ఆన్ లైన్ లావాదేవీల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఇంటర్ నెట్ సేవలు అందరికీ అందుబాటులోకి రావడం, స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరగడం, ఈ కామర్స్ సైట్స్ ఆఫర్లు ప్రకటించడంతో చెల్లింపులు పెరిగాయని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..