EPFO: మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇదిగో సులభమైన మార్గాలు

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ ఉండటం తప్పనిసరి. ప్రతి ఉద్యోగికి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో కట్ చేయబడుతుంది. అలాగే కంపెనీ నుంచి..

EPFO: మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలనుకుంటున్నారా..? ఇదిగో సులభమైన మార్గాలు
UAN నెంబర్, ఆధార్ కార్డ్‌, ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్, చందదారుని వివరాలు ఉండాలి. చిరునామా, ఫోటో, EPFO ప్రొఫైల్ కలిగి ఉండాలి.
Follow us
Subhash Goud

|

Updated on: Dec 17, 2022 | 2:59 PM

సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ ఉండటం తప్పనిసరి. ప్రతి ఉద్యోగికి నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో కట్ చేయబడుతుంది. అలాగే కంపెనీ నుంచి కూడా కొంత అమౌంట్ ఉద్యోగి ఖాతాకు బదిలీ అవుతుంటుంది. అయితే పీఎఫ్‌ అనేది ప్రతి నెల ఉద్యోగి ఖాతాల్లోకి బదిలీ అవుతుంది. అయితే మీ పీఎఫ్‌ ఖాతాలో ఎంత డబ్బు ఉందనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అన్ని ఆన్‌లైన్‌ విధానాలు అందుబాటులోకి వస్తుండటంతో మరింత సులభతరం అవుతోంది. ప్రతిసారి పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడానికి వెబ్‌సైట్లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ఇలా వెబ్‌సైట్లోనే కాకుండా వివిధ మార్గాల ద్వారా కూడా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలోనే ఈ పని చేసుకోవచ్చు.

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునేందుకు వివిధ మార్గాలు:

మిస్డ్ కాల్ నుండి బ్యాలెన్స్ తెలుసుకోండి

➦ మీ పీఎఫ్‌ డబ్బును చెక్ చేయడానికి మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. దీని తర్వాత, మీరు ఈపీఎఫ్‌వో​సందేశం ద్వారా పీఎఫ్‌ వివరాలను పొందుతారు. ఇక్కడ కూడా మీ యూఏఎన్‌, పాన్‌, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి.

ఆన్‌లైన్‌లో..

➦ ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి మీరు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి, epfindia.gov.inలో ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

➦ ఇప్పుడు మీ ఇ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే, passbook.epfindia.gov.inకి కొత్త పేజీ వస్తుంది.

➦ ఇప్పుడు ఇక్కడ మీరు మీ వినియోగదారు పేరు (యూఏఎన్‌ నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చార్‌ చేయాలి.

➦ అన్ని వివరాలను పూరించిన తర్వాత, మీరు కొత్త పేజీకి వెళ్తారు. ఇక్కడ మీరు సభ్యుల ఐడీని ఎంచుకోవలసి ఉంటుంది.

➦ ఇక్కడ మీరు ఇ-పాస్‌బుక్‌లో మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

మీరు ఉమాంగ్‌ యాప్

➦ దీని కోసం మీరు మీ ఉమాంగ్‌ యాప్ ఓపెన్‌ చేసి ఈపీఎఫ్‌వోపై క్లిక్ చేయండి.

➦ ఇప్పుడు మరొక పేజీలో ఉద్యోగి-కేంద్రీకృత సేవలపై క్లిక్ చేయండి.

➦ ఇక్కడ మీరు ‘View Passbook’పై క్లిక్ చేయండి. దీనితో, మీరు మీ UAN నంబర్, పాస్‌వర్డ్ (OTP) నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

➦ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దీని తర్వాత మీరు మీ PF బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

యూఏఎన్‌ నంబర్‌ లేకుండా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ తనిఖీ

➦ ముందుగా epfindia.gov.in EPF హోమ్ పేజీకి లాగిన్ చేయండి

➦ ‘మీ EPF బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి’పై క్లిక్ చేయండి

➦ మీరు epfoservices.in/epfo/కి మళ్లించబడతారు. ఇక్కడ కనిపించే బ్యాలెన్స్ సమాచారంలోకి వెళ్లండి.

➦ అక్కడ మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, ఈపీఎఫ్‌వో​ఆఫీస్ లింక్‌పై క్లిక్ చేయండి

➦ పీఎఫ్‌ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి

➦ తర్వాత ‘సమర్పించు’పై క్లిక్ చేయండి. అప్పుడు మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి