Smart TV Vs Android TV: స్మార్ట్ టీవీ.. ఆండ్రాయిడ్ టీవీ.. ఇందులో ఏది కొనడం బెటర్ ఆప్షన్
ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో స్మార్ట్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు ఉంటున్నాయి. ఒకప్పుడు డబ్బాలాంటి టీవీలు ఉండగా, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ప్రతి ఇళ్లల్లో స్మార్ట్ టీవీలే..
ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లల్లో స్మార్ట్ టీవీలు, ఆండ్రాయిడ్ టీవీలు ఉంటున్నాయి. ఒకప్పుడు డబ్బాలాంటి టీవీలు ఉండగా, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ప్రతి ఇళ్లల్లో స్మార్ట్ టీవీలే దర్శనమిస్తున్నాయి. ఇందులో స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీలు ఉంటాయి. ఈ రెండింటిలోనూ తేడా ఉంటుంది. స్మార్ట్ టీవీ కంటే అదే బ్రాండ్ ఆండ్రాయిడ్ టీవీ వెయ్యి, లేదా రెండు వేల రూపాయల తేడా ఉంటుంది. స్మార్ట్ టీవీ అలాగే ఆండ్రాయిడ్ టీవీలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
స్మార్ట్ టీవీని ఇంటర్నెట్ టీవీ అని కూడా అంటారు. స్మార్ట్ టీవీలో మీరు ఇంటర్నెట్ కనెక్టివిటీ ద్వారా అదనపు ప్రోగ్రామ్‌లు అలాగే ప్రత్యేక ఫీచర్లను పొందుతారు. స్మార్ట్ టీవీలో మీరు శాటిలైట్ ఛానెల్‌లతో పాటు ఓటీటీ కంటెంట్‌ను కూడా చూడవచ్చు. స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్ లాగానే ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. వివిధ బ్రాండ్‌ల స్మార్ట్ టీవీలు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేస్తాయి. ఉదాహరణకు, Samsung స్మార్ట్ TV Tizen ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. అయితే LG స్మార్ట్ TV WebOS ఆపరేటింగ్ సిస్టమ్‌లో నడుస్తుంది. చాలా స్మార్ట్ టీవీలలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి యాప్‌లు ఉంటాయి. మీరు వీటిపై గేమ్స్ కూడా ఆడవచ్చు. వీడియోలు, సినిమాలు కూడా చూడవచ్చు. అయితే మీరు స్మార్ట్ టీవీలో ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయలేరు. అంటే స్మార్ట్ టీవీ తో మీరు లేటెస్ట్ యాప్స్ ను యాక్సెస్ చేయలేరు.
నిజానికి ఆండ్రాయిడ్ టీవీ కూడా ఒక రకమైన స్మార్ట్ టీవీ. ఇది స్మార్ట్ టీవీ లాగానే యాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఫీచర్‌లను కలిగి ఉంటుంది. కానీ ఈ రెండింటిలో వ్యత్యాసం ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించినది. ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తుంది. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు మీ టీవీని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌తో సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అంతేకాకుండా స్మార్ట్ టీవీక్, ఆండ్రాయిడ్ టీవీ మధ్య ఆటోమేటిక్ అప్‌డేట్‌లు, వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ కాస్టింగ్ అలాగే నావిగేషన్ విషయంలో కూడా తేడా ఉంది.
యాప్స్ ఆటోమేటిక్ అప్‌డేట్స్..
ఆండ్రాయిడ్ టీవీలో యాప్స్ మన ఫోన్ యాప్స్‌లా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. కానీ, అప్‌డేట్ ఫీచర్ స్మార్ట్ టీవీల్లో ఉండదు. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఆపరేటింగ్ సిస్టమ్ పాతది అవుతుంది.
వాయిస్ సపోర్ట్..
ఇప్పుడు వాయిస్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం.., android TVలో ఇన్ బిల్ట్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దానితో మీరు ఛానెల్‌ని సులభంగా మార్చవచ్చు. చాలా స్మార్ట్ టీవీలలో ఇన్ బిల్ట్ వాయిస్ సపోర్ట్ ఉండదు. అలాంటి ఫీచర్ కోసం మీరు విడిగా స్మార్ట్ స్పీకర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్ టీవీలో అదనపు ఫీచర్స్..
ఆండ్రాయిడ్ టీవీలో అలాగే స్మార్ట్ టీవీలో మీరు ఫోన్‌తో స్క్రీన్ మిర్రరింగ్ చేయవచ్చు. అంటే మీరు మీ టీవీని మీ ఫోన్ స్క్రీన్‌గా ఉపయోగించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ టీవీలో చేయడం చాలా సులభం. అదీకాకుండా ఆండ్రాయిడ్ టీవీలో వీడియో క్వాలిటీ, ఇమేజింగ్ మంచి క్వాలిటీతో ఉంటుంది. స్మార్ట్ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. టైమ్ కూడా ఎక్కువ పడుతుంది. అదేవిధంగా ఆండ్రాయిడ్ టీవీ లో ఉన్నంత వీడియో, ఇమేజింగ్ క్వాలిటీ స్మార్ట్ టీవీలో ఉండదు.
నావిగేషన్‌కు సంబంధించి మరో పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఫీచర్‌లో స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ టీవీల కంటే ఈజీగా ఉంటాయి. ఈజీ అలాగే యూజర్ ఫ్రెండ్లీ నావిగేషన్ ఇంటర్ ఫేస్ తో స్మార్ట్ టీవీలో ఛానల్ మార్చడం చాలా సులువుగా ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ ఎన్విరాన్‌మెంట్ అలవాటు లేని వారికి ఆండ్రాయిడ్ టీవీని నావిగేట్ చేయడం కష్టంగా ఉంటుంది.
రెండింటిలోనూ ఏది బెటర్..
అందుకే ఈ అన్ని పారామిటర్స్ చెక్ చేసిన తరువాత మనకు స్మార్ట్ టీవీల కంటే ఆండ్రాయిడ్ టీవీలు మంచివని అర్ధం అవుతుంది. మీరు బడ్జెట్ కొద్దిగా అటూ ఇటూ అయినా ఫర్వాలేదు అనుకుంటే ఆండ్రాయిడ్ టీవీ కొనుక్కోవడమే మంచిది. అవసరమైతే ఒక నెల లేదా రెండు నెలలు సేవింగ్స్ చేసి ఆండ్రాయిడ్ టీవీ కొనుక్కుంటే మీకు భవిష్యత్ లో ఇబ్బందిలేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడలేని పరిస్థితి ఉంటే స్మార్ట్ టీవీ కొనుక్కోవచ్చు. అంతేకాదు.. మీకు ఈజీ నావిగేషన్.. కన్ఫ్యూజన్ లేకుండా యాప్స్ సెలెక్ట్ చేసుకునే అవకాశం కావాలంటే కూడా ఆండ్రాయిడ్ టీవీ వైపు చూడకపోవడం మంచింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ చేయడం కష్టంగా ఉండే వారికి స్మార్ట్ టీవీ బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి