AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Bike: సరికొత్త ఈ-బైక్.. డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ .. జనవరి నుంచి మార్కెట్ లోకి..

కానీ ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే సంస్థ సరికొత్త మోడల్లో ఆధునిక సదుపాయాలతో బైక్ ను త్వరలో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

Electric Bike: సరికొత్త ఈ-బైక్.. డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ .. జనవరి నుంచి మార్కెట్ లోకి..
Pure EV Eco Dryft
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 17, 2022 | 1:12 PM

Share

మంచి ఎలక్ట్రిక్ బైక్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పడినట్లే! ఇప్పటి వరకూ చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చిన వాటిల్లో ఎక్కువ మోపెడ్ స్టయిల్ లేదా స్కూటర్ మోడల్లో నే ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే సంస్థ సరికొత్త మోడల్లో ఆధునిక సదుపాయాలతో బైక్ ను త్వరలో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. లిథియం ఐయాన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన ఈ ప్యూర్ ఈవీ తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను ఎకో డ్రిఫ్ట్ పేరిట తీసుకొస్తోంది. 2023 జనవరిలో దీనిని మార్కెట్ లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇవి ప్రత్యేకతలు..

ఎకో డ్రిఫ్ట్ లో ఆకర్షణీయ సదుపాయాలు ఉన్నాయి. 18 అంగుళాల అల్లాయ్ ఫ్రంట్ వీల్, 17 అంగుళాల అల్లాయ్ బ్యాక్ వీల్, టెలీస్కోపింగ్ ఫ్రంట్ సస్పెన్షన్, యాంగులర్ ల్యాంప్స్, రెండు షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి. మూడు వేరియంట్లలో.. తయారీ సంస్థ ఈ బైక్ను మూడు మోడళ్లలో తీసుకొస్తోంది. డ్రైవ్, క్రాస్ ఓవర్, థ్రిల్ పేరిట ఎరుపు, గ్రే, నలుపు, బ్లూ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.

టెక్నికల్ ఫీచర్లు ఇవి..

బండి బరువు 101 కేజీలు కాగా.. 140 కేజీల వరకూ లోడ్ సామర్థ్యం ఉంది. 3 కేడబ్ల్యూహచ్ సామర్థ్యం కలిగిన మోటర్ . దీనికి ఏఐఎస్ 156 సర్టిఫికెట్ కలిగి ఉంది. ఇది ఒక సారి చార్జ్ చేస్తే 85 నుంచి 130 వరకూ వస్తుంది. అత్యధిక స్పీడ్ గంటకు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఐదు సెకం డ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..