Profits in Gold Investment: బంగారంపై పెట్టుబడి లాభాదాయకం.. మీకు రాబడి ఎలా వస్తుందంటే..

మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అక్కడ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందనే అందరూ అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై..

Profits in Gold Investment: బంగారంపై పెట్టుబడి లాభాదాయకం.. మీకు రాబడి ఎలా వస్తుందంటే..
Gold Price
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 17, 2022 | 10:53 AM

మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. అక్కడ ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందనే అందరూ అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పై మంచి రాబడి సంపాదించవచ్చు. కానీ, 2022 లో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ తో పోలిస్తే బంగారంపై చేసిన ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ రాబడి వచ్చినట్లు కనిపిస్తోంది. గత సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి MCXలో బంగారం ధర 48 వేల రూపాయలకు దగ్గరగా ఉండగా, ఇప్పుడు దాని ధర 54 వేల రూపాయలకు చేరుకుంది. అంటే దాదాపు 10 శాతం రాబడి ఇచ్చిందని అనుకోవచ్చు. అదే సమయంలో సెన్సెక్స్ 58 వేల పాయింట్ల నుండి 62 వేల వరకు చేరుకుంది. ఇది దాదాపు ఏడు శాతం రాబడిని ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో రూపాయి బలహీనత కారణంగా భారతదేశంలో బంగారం ధర మరింత పెరిగింది. విదేశీ మార్కెట్‌లో దేశీయ మార్కెట్‌లో ధరలు అంతగా పెరగలేదు. 2022లో ఇప్పటి వరకు డాలర్‌తో రూపాయి దాదాపు 11 శాతం నష్టపోయింది. గతేడాది ఆగస్టు చివరి నాటికి ఒక డాలర్ విలువ 74 రూపాయలకు దగ్గరగా, ఇప్పుడు ధర 82 రూపాయలకు పైనే ఉంది. కానీ ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే… వచ్చే ఏడాది అంటే 2023లో బంగారం ధర పెరుగుతుందా లేదా అనేది. దీనికి అవుననే సమాధానం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలు ఉన్నప్పటికీ… ఈ సంవత్సరం నవంబర్ ప్రారంభం వరకు US డాలర్ బుల్లిష్‌గా ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గిన వెంటనే.. డాలర్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో బంగారం ధర కూడా పెరిగింది. అదే సమయంలో మాంద్యం భయం మరింత తీవ్రమైంది. అందుకే బంగారం ధరలు పెరగడానికి మరో కారణంగా కనిపిస్తోంది.

చారిత్రాత్మకంగా గ్లోబల్ మాంద్యాలు బంగారం ధరలను పెంచడం ఎప్పుడూ జరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2023కి సంబంధించిన గోల్డ్ ఔట్‌లుక్‌ తన రిపోర్ట్ లో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ గందరగోళంతో పాటు, సురక్షితమైన పెట్టుబడిగా కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. అలాగే డాలర్ మృదుత్వం కూడా బంగారం ధరలకు మద్దతు ఇస్తుందని గోల్డ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. 2023లో బంగారం ధరలు పెరుగడానికి మరిన్ని కారణాలు ఉన్నాయని ట్రస్ట్‌లైన్ సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ రాజీవ్ కపూర్ భావిస్తున్నారు.

ప్రపంచ స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొవడానికి కేంద్ర బ్యాంకులు తీసుకోవలసిన చర్యలు బంగారం ధరల దిశను నిర్ణయిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం గ్లోబల్ మాంద్యం కారణంగా ధరలు తగ్గుతాయని అంచనా. 2023లో దేశీయ మార్కెట్‌లో బంగారం ధర 57,000 రూపాయల స్థాయికి చేరుకోవచ్చని రాజీవ్ అభిప్రాయపడ్డారు. అయితే బంగారం మార్కెట్‌లో వ్యాపారం చేసే ముందు మీరు మీ ఆర్థిక సలహాదారు అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..