Washington Post: లైవ్‌లో ఉద్యోగులను తొలగించిన అమెజాన్‌ సీఈవో.. ఎంప్లాయిస్ ప్రశ్నించడంతో..

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఈకామర్స్‌ రంగంతో పాటు ఇతర రంగాల్లో వ్యాపార కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో మీడియా విభాగానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని..

Washington Post: లైవ్‌లో ఉద్యోగులను తొలగించిన అమెజాన్‌ సీఈవో.. ఎంప్లాయిస్ ప్రశ్నించడంతో..
Washington Post
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 17, 2022 | 9:56 AM

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ఈకామర్స్‌ రంగంతో పాటు ఇతర రంగాల్లో వ్యాపార కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో మీడియా విభాగానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ ర్యాన్ ఆఫీస్‌ మీటింగ్‌లో తెలిపారు. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులతో సీఈవో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో 2 వేల 500 మంది పనిచేస్తున్న సంస్థలో సింగిల్‌ డిజిట్‌ పర్సంటేజ్‌ సిబ్బందిని ఫైర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వాషింగ్టన్ పోస్ట్ లో తొలగించిన వారి స్థానాల్ని భర్తీ చేసేలా మరికొంత మందిని నియమించుకుంటామని, ఉద్యోగుల సంఖ్య తగ్గదని ర్యాన్ పేర్కొన్నారు.

అంతేకాదు ఉద్యోగాల కోత మా ఆశయాలకు వ్యతిరేకం కాదు. కానీ మా కస్టమర్ల అవసరాలను తీర్చని కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రకటనలపై ఆధారపడే కంపెనీలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడమే ఉద్యోగుల తొలగింపులకు కారణమని కంపెనీ తెలిపింది. ర్యాన్‌ తొలగింపుల ప్రకటనపై కంపెనీ ఉద్యోగులు మూకుమ్ముడిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కానీ ఉద్యోగుల తీరుతో జడుసుకున్న సీఈవో రిప్లయి ఇవ్వకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం లైవ్‌ లే ఆఫ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

కొద్ది వారాల క్రితం వాషింగ్టన్ పోస్ట్ వీక్లీ మ్యాగజైన్‌ను క్లోజ్‌ చేసి.. 11 మంది న్యూస్‌రూమ్ ఉద్యోగులపై కోత విధించింది. ఆ ప్రకటన చేసిన కొద్ది వారాల తర్వాత.. తాజాగా ఆర్థిక ప్రతికూలతల్ని కారణంగా చూపిస్తూ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. పత్రిక వీక్లీ చివరి మ్యాగజైన్‌ను డిసెంబర్ 25న ప్రచురించనున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదిక తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..