Skin Care Tips: అలియా భట్‌లాంటి అందం కావాలంటే ఇలాంటి ఇంటి ఫేస్‌ ప్యాక్‌లు ట్రై చేయండి.. మెరిసిపోతారు..

మెరిసే, మచ్చలేని చర్మం కోసం ఎన్నో రకాల హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అందుకోసం మార్కెట్‌లో దొరికే ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. పార్లర్ లో వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. ఇన్ని చేసినప్పటికీ కావలసిన అందమైన చర్మాన్ని పొందలేరు. దాంతో నిరాశ చెందుతారు.

Skin Care Tips: అలియా భట్‌లాంటి అందం కావాలంటే ఇలాంటి ఇంటి ఫేస్‌ ప్యాక్‌లు ట్రై చేయండి.. మెరిసిపోతారు..
Corn Flour For Skin
Follow us

|

Updated on: Dec 16, 2022 | 5:06 PM

అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. మెరిసే, మచ్చలేని చర్మం కోసం ఎన్నో రకాల హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. అందుకోసం మార్కెట్‌లో దొరికే ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ , ఫేస్ ప్యాక్ లు వాడుతుంటారు. పార్లర్ లో వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. ఇన్ని చేసినప్పటికీ కావలసిన అందమైన చర్మాన్ని పొందలేరు. దాంతో నిరాశ చెందుతారు. విశ్వాసం కోల్పోతుంటారు. అయితే వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం కావాలంటే ఒక్కసారి ఈ చిట్కాలను ట్రై చేయండి. అలియా భట్ లాగా మెరిసే చర్మం కోసం మొక్కజొన్న పిండిని వాడి చూడండి..ఫలితం మీరు ఆశించిన విధంగానే ఉంటుంది.

* మొక్కజొన్న పిండి, పాలు

ఈ ఫేస్‌ప్యాక్‌ని ఉపయోగించడం ద్వారా అందమైన చర్మాన్ని పొందగలుగుతారు. ఇందుకోసం 2 చెంచాల మొక్కజొన్న పిండిని తీసుకుని, 1 చెంచా తేనె, 3 చెంచాల పాలు మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా 5-10 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది.

* మొక్కజొన్న పిండి, పెరుగు

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి మీకు 2 చెంచాల మొక్కజొన్న పిండి అవసరం, దానికి 1 చెంచా పెరుగు వేసి, ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ పేస్ట్‌ను మందపాటి మిశ్రమంలా చేసుకోవాలి.. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

* ముఖంపై ముడతలు తొలగిపోతాయి.

మొక్కజొన్న పిండిలో ప్రోటీన్, అనేక ఖనిజాలు ఉంటాయి. ముఖంపై ముడతలు ఉంటే వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ మీ చర్మం అందంగా, పునరుజ్జీవింపజేయడానికి ముఖంలోని నూనె, మురికిని గ్రహిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి