AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: దేశంలోనే అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన మన హైదరాబాదీ.. వైరలవుతున్న ఫోటోలు..

నసీర్ ఖాన్ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ పర్సన్. ఇన్‌స్టాగ్రామ్‌లో నసీర్‌కు దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను ఖరీదైన కార్లతో ఫోటోలు, వీడియోలను కూడా షేర్‌ చేస్తుంటారు. నసీర్ ఖాన్‌కు భారీ కార్ల కలెక్షన్ ఉంది.

Hyderabad: దేశంలోనే అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసిన మన హైదరాబాదీ.. వైరలవుతున్న ఫోటోలు..
Most Expensive Supercar
Jyothi Gadda
|

Updated on: Dec 16, 2022 | 5:37 PM

Share

దేశంలోనే అత్యంత ఖరీదైన కారును హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. ఈ వ్యాపారి పేరు నసీర్ ఖాన్. అతను ఇటీవల మెక్‌లారెన్ 765 ఎల్‌టి స్పైడర్ కారును కొనుగోలు చేశాడు. అతను కారు డెలివరీకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 1 లక్ష 60 వేల వ్యూస్‌ వచ్చాయి. నసీర్ ఖాన్ McLaren 765 LT స్పైడర్ ధర దాదాపు రూ.12 కోట్లు. భారతదేశంలో ఈ కారు మొదటి కస్టమర్ నసీర్ కావచ్చునని నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నసీర్ కారు డెలివరీని అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కారుతో కలిసి దిగిన ఫోటోలు, వీడియో ఫోటోను షేర్ చేస్తూMCLAREN 765LT స్పైడర్‌కు ఇంటికి స్వాగతం అంటూ రాసుకొచ్చాడు నసీర్‌. ఈ అందమైన కారును అందుకోవడం ఎంత మధురమైన అనుభూతి అన్నాడు. వీడియోలో, నసీర్ కారును బయటకు తీస్తున్నాడు.. కారు MSO వోల్కనో రెడ్ షేడ్‌లో మెరుస్తుంది.

765 LT స్పైడర్ వేరియంట్ మెక్‌లారెన్ అత్యంత వేగవంతమైన కారు. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే దీని పైకప్పు కేవలం 11 సెకన్లలో ఓపెన్‌ అవుతుంది. ఈ కారులో 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్ ఉంది కారు ఇంజన్ 765 Ps శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్ట టార్క్ 800 Nm.

ఇవి కూడా చదవండి

నసీర్ ఖాన్ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ పర్సన్. ఇన్‌స్టాగ్రామ్‌లో నసీర్‌కు దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో తనను తాను కార్ కలెక్టర్‌గా, వ్యవస్థాపకుడిగా అభివర్ణించుకున్నాడు. అతను ఖరీదైన కార్లతో ఫోటోలు, వీడియోలను కూడా షేర్‌ చేస్తుంటారు. నసీర్ ఖాన్‌కు భారీ కార్ల కలెక్షన్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతను రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, మెర్సిడెస్-బెంజ్ G350d, ఫోర్డ్ ముస్టాంగ్, లంబోర్ఘిని అవెంటడోర్, లంబోర్ఘిని ఉరస్ వంటి ఖరీదైన కార్లతో తన ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కాకుండా అతని వద్ద ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.