Assembly Elections 2023: తాడోపేడో తేల్చుకునుడే.. యుద్ధానికి సై అంటే సై.. తెలంగాణతోపాటు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు ఇవే..
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో 2022లో జరగాల్సిన అన్ని రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాదిలో ఏయే రాష్ట్రాలు ఎన్నికలను జరగనున్నాయో ఓ సారి చూద్దాం.

2023లో దేశంలోని 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అన్నిరాజకీయ పార్టీలకు ఇది చాలా బిజీ టైమ్ అని చెప్పవచ్చు. ఇందులో తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉంది. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. దీనికి ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పేందుకు బీజేపీ పెద్ద ఎత్తున వ్యూహం రచిస్తోంది. అదే స్థాయిలో ఢీ కొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టి జాతీయ స్థాయిలో దూసుకుపోయేందుకు రెడీ అవున్నారు సీఎం కేసీఆర్. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో కొత్త సంవత్సరం మొదటి నెలలో ఎన్నికలు జరగనున్నాయి. 9 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున వచ్చే ఏడాది జాతీయ పార్టీల నేతలు బిజీబిజీగా ఉండే అవకాశం ఉంది.
ఏ రాష్ట్రాలు..?
2023లో మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అన్ని అనుకున్నట్లుగానే జరిగితే జమ్ము కశ్మీర్‌లో కూడా ఈ తొమ్మిది రాష్ట్రాలతో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మేఘాలయ (60) అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మార్చి నెలలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాగాలాండ్‌లోని 60 స్థానాలకు కూడా మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి.
60 మంది సభ్యుల త్రిపుర శాసనసభకు కూడా మార్చి 2023లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు మే నెలలో ఎన్నికలు జరగాలి. రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి.
ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2023 చివరి నాటికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి. 230 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మధ్యప్రదేశ్‌కు కూడా జనవరి నెలలోనే ఎన్నికలు జరగాలి.
40 స్థానాలున్న మిజోరం రాష్ట్రంలో కూడా డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. 200 మంది సభ్యులున్న రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జనవరిలోనే జరగాలి. 119 స్థానాలున్న తెలంగాణాలో కూడా డిసెంబర్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి సవాల్
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బిగ్ సవాల్ అని చెప్పవచ్చు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎన్నికలు జరిగితే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్నారు. అలాగే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక సొంత రాష్ట్రం కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్గేకు ఈ ఎన్నికలు పెద్ద పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది.
బీజేపీకి కూడా కీలకం..
2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికలు బీజేపీకి కీలకం. దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే బీజేపీ వివిధ రాష్ట్రాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ అది పార్టీకి ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. వివిధ రాజకీయ పార్టీల భవితవ్యం తేలనుంది. పలు రాష్ట్రాల రాజకీయ నేతల భవిష్యత్తు కూడా ఎన్నికలపైనే ఆధారపడి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..