Delhi Murder: ఢిల్లీలో ఆగని దారుణాలు.. ఇంటి కాలింగ్‌ బెల్‌కొట్టి మరీ మహిళను కాల్చి చంపిన దుండగులు..

ఇంటర్‌ విద్యార్థినిపై యాసిడ్‌ ఎటాక్‌ ఉదాంతం మరువక ముందే, మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళను ముగ్గురు దుండగులు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Delhi Murder: ఢిల్లీలో ఆగని దారుణాలు.. ఇంటి కాలింగ్‌ బెల్‌కొట్టి మరీ మహిళను కాల్చి చంపిన దుండగులు..
Aman Vihar Murder
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 16, 2022 | 6:04 PM

దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారుతోంది. వరుస హత్యలు, దారుణాలతో రాజధాని హస్తిన హడలెత్తిపోతోంది. హత్యలు, అత్యచారాలు, యాసిడ్‌ ఎటాక్‌లు వంటి ఘటనలు రాజధాని వాసుల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్థినిపై యాసిడ్‌ ఎటాక్‌ ఉదాంతం మరువక ముందే, మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. 55 ఏళ్ల మహిళను ముగ్గురు దుండగులు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అమన్‌ విహార్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సుమారుగా 55 ఏళ్లు పైబడిన మహిళను పక్కా పథకం ప్రకారం కొందరు హతమార్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గురువారం రాత్రి వేళ ఒక వ్యక్తి ఒక ఇంటి ముందు నిలబడి ఉండగా, మరో వ్యక్తి రోడ్డుపై కాపాలాగా ఉన్నాడు. కాగా, ఆ ఇంటి డోర్‌ తీసిన ఓ పెద్దావిడపై గేట్‌ వద్ద ఉన్న నిలబడి ఉన్న వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. రోడ్డుపై కాపాలా ఉన్న వ్యక్తితోపాటు మరో వ్యక్తిని అతడు కలుసుకున్నాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే, ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గన్‌ కాల్పుల్లో చనిపోయిన మహిళ 55 ఏళ్ల గీత అని గుర్తించారు. ఏడాది కిందట ఆమె కుమారుడు ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. దీనిని సహించని యువతి కుటుంబం ఈ దారుణానికి పాల్పడిందని ఆరోపించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా హంతకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!