Alien Life: ఆ వస్తువులు ఏలియన్స్ కు సంబంధించినవేనా? పెంటగాన్ పరిశోధకులు ఏం చెబుతున్నారు?
ఏలియన్స్ గా పిలువబడే జీవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో పెంటగాన్ కు చెందిన పరిశోధకుల బృందం ఓ రిపోర్ట్ ప్రపంచానికి అందించింది.
అనంత విశ్వంలో వందల కొద్దీ జీవులు.. అందులో మానవుడు గుర్తించినవి కొన్నయితే.. గుర్తించనివి కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. అలా గుర్తించని, మానవ గమనంలో లేని వస్తువులు, జీవుల కోసం ఏళ్లుగా మానవుడు పరిశోధన చేస్తూనే ఉన్నాడు. వివిధ స్థాయిల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఏలియన్స్ గా పిలువబడే జీవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈక్రమంలో పెంటగాన్ కు చెందిన పరిశోధకుల బృందం ఓ రిపోర్ట్ ప్రపంచానికి అందించింది. అదేంటంటే కొన్ని వందల సంఖ్యలో అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటే మనిషి గుర్తించని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించే వస్తువులు ఉన్నాయని.. వాటిని తాము గుర్తించామని చెప్పింది. గానీ ఆ వందల కొద్దీ వస్తువుల్లో ఏలియన్స్ గురించిన సమాచారం, లేదా వాటి ఉనికి గురించిన వివరాలు అయితే ఏమి దొరకలేదని స్పష్టం చేసింది.
వీరి పరిశోధన ఏంటి?
పెంటగాన్ కు చెందిన ది ఆల్ డోమైన్ ఆనోమలీ రిసోల్యూషన్ ఆఫీస్(ఏఏఆర్ఓ) ఉంది. అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ను గుర్తించడమే దాని పని. కేవలం ఆకాశం మాత్రమే కాదు.. ఈ అనంత విశ్వంలో ఎక్కడైనా అంటే సముద్ర గర్భంలో, ఆకాశంలో, అంతరిక్షంలో ఇలా ఎక్కడైన ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కదిలే వస్తువులను గుర్తించడమే దాని విధి.
ఒక్కటి కూడా లేదు..
ఆ దిశగా అనేక ప్రయోగాలు, పరిశోధనలు చేసిన ఆ పరిశోధకులకు కొన్ని వందల కొద్దీ ఆబ్జెక్ట్స్ దొరికాయి. 2004 నుంచి 2021 వరకూ 144 సార్లు ఇలాంటి ఆబ్జెక్ట్స్ తారస పడగా.. దాదాపు 80 రకాల ఆబ్జెక్ట్స్ను వివిధ రకాల సెన్సార్ ద్వారా కాప్చర్ చేసినట్లు నిపుణుల బృందం పేర్కొంది. అయితే వాటిలో ఒక్కటి కూడా ఏలియన్స్ ఉనికిని తెలియజేయలేదని వివరించింది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం..