Tech Tips: వాట్సాప్‌లో టైప్ చేయకుండా మెసేజ్ పంపే ట్రిక్ మీకు తెలుసా?

వాట్సాప్‌.. ఇది ప్రతి ఒక్కసారి స్మార్ట్‌ఫోన్‌లో ఉండేదే. చిన్నా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇన్‌స్టంట్ మెసేజింగ్..

Tech Tips: వాట్సాప్‌లో టైప్ చేయకుండా మెసేజ్ పంపే ట్రిక్ మీకు తెలుసా?
Whatsapp
Follow us
Subhash Goud

|

Updated on: Dec 17, 2022 | 3:47 PM

వాట్సాప్‌.. ఇది ప్రతి ఒక్కసారి స్మార్ట్‌ఫోన్‌లో ఉండేదే. చిన్నా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. రోజూ లెక్కలేనన్ని సందేశాలు పంపుకొంటున్నారు. వాట్సాప్ లేదా ఇతర యాప్‌లలో మెసేజ్‌లను టైప్ చేసి పంపడం అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు వాట్సాప్‌లో టైప్ చేయకుండానే టెక్స్ట్ మెసేజ్ పంపవచ్చు. ఈ ఫీచర్ మీ వాయిస్ ఆధారంగా పని చేస్తుంది. అంటే మీరు మాట్లాడడం ద్వారా మీరు పంపాలనుకుంటున్న సందేశం, మీరు చెప్పేది పూర్తిగా టైప్ అవుతుంటుంది.

దీని కోసం ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ ఇండిక్ కీబోర్డ్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి. ఇండిక్ కీబోర్డ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వాట్సాప్‌ను ఓపెన్‌ చేయండి. ఆపై మీరు సందేశం పంపాలనుకుంటున్న వ్యక్తి చాట్‌కి వెళ్లండి. ఇప్పుడు సందేశాన్ని టైప్‌ చేయడానికి కీబోర్డ్‌ను తెరవండి. అదనపు కీబోర్డ్‌లు ఎగువన మైక్ గుర్తు కనిపిస్తుంటుంది. దానిపై నొక్కండి. కానీ వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్‌లు పంపడానికి కూడా మైక్ ఉంటుంది. ఆ మైక్‌ని ఉపయోగించవద్దు. మీరు కీబోర్డ్‌లోని మైక్‌ను మాత్రమే ఉపయోగించాలి.

ఇప్పుడు మీ ముందు మైక్ కనిపిస్తుంది. మాట్లాడమని కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని మాత్రమే మాట్లాడండి. మీ సందేశం పూర్తయిన తర్వాత మైక్ చిహ్నాన్ని నొక్కండి. ఇక్కడ విశేషమేమిటంటే, ఈ రోజు చాలా కీబోర్డ్‌లు ప్రాంతీయ భాషలతో పాటు ఆంగ్ల భాషను సపోర్ట్ చేస్తాయి. మీరు మాట్లాడినవన్నీ ఇక్కడ టైప్ చేయబడతాయి. తర్వాత సెండ్ బటన్ నొక్కారు. వెంటనే మీ సందేశం వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే