Whatsapp: మీకు వాట్సాప్ ఉందా.? యాప్‌లో ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు ఎంత తెలుసు.?
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ ఏంటనే ప్రశ్నకు సమాధానం వాట్సాప్. ఇందులో ఉన్న ఫీచర్లే దీనికి కారణం. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది వాట్సాప్. ముఖ్యంగా వినియోగదారుల గోప్యతకు వాట్సాప్..
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ ఏంటనే ప్రశ్నకు సమాధానం వాట్సాప్. ఇందులో ఉన్న ఫీచర్లే దీనికి కారణం. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది వాట్సాప్. ముఖ్యంగా వినియోగదారుల గోప్యతకు వాట్సాప్ పెద్ద పీట వేసింది. సెక్యూరిటీ ఫీచర్ల విషయంలో వాట్సాప్‌లో ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇంతకీ వాట్సాప్ అందిస్తోన్న బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి.? వాటి వల్ల ఉపయోగాలు ఏంటి.? లాంటి వివరాలు మీకోసం..
* ఇటీవలి కాలంలో వాట్సాప్ గ్రూప్‌లు పెరిగిపోతున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు నచ్చకపోయినా కొందరు గ్రూప్స్‌లో యాడ్ చేస్తుంటారు. అయితే మీకు తెలియని వ్యక్తులు, లేదా మీ ఫోన్‌లో సేవ్ చేయని నెంబర్లు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయకుండా సెట్టింగ్స్ చేసుకునే అవాకశం ఉంది.
* వాట్సాప్‌లో పెట్టే స్టేటస్ ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదనే ఫీచర్‌ను సైతం వాట్సాప్ అందిస్తోంది. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో మీరు కోరుకున్న వ్యక్తులే మీ స్టేటస్‌ను చూసేలా స్టేటస్ సెట్టింగ్స్‌లో మార్చుకోవచ్చు.
* వాట్సాప్‌లో లాస్ట్ సీన్‌ను కూడా కనిపించకుండా చేసే ఫీచర్‌ను వాట్సాప్ అందిస్తోంది. లాస్ట్ సీన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎవరికీ కనిపించకుండా చేసుకునే అవకాశం ఉంది.
* మీ వాట్సాప్ డీపీ ఎవరికి కనిపించాలి, ఎవరికి కనిపించకూడదనే ఫీచర్‌ను వాట్సాప్ అందిస్తోంది. మీ ఫోన్‌లో సేవ్ చేయని నెంబర్లకు మీ డిస్‌ప్లే పిక్చర్ కనిపించకుండా చేసుకోవచ్చు.
* వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసే విషయంలోనూ సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తోంది. ఇందుకోసం పాస్‌వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ సహాయంతో యాప్‌ను లాక్ చేసుకోవచ్చు.
* వాట్సాప్ అందిస్తోన్న మరో సెక్యూరిటీ ఫీచర్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేసుకునే అవకాశం. దీంతో మీకు నచ్చిన వ్యక్తులు మీకు మెసేజ్‌ను పంపించకుండా చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన వివరాలు బ్లాక్ చేసిన నెంబర్లకు కనిపించకుండా చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..