ఏసీ నుంచి చల్లటి గాలి రావాలంటే ఇలా చేయండని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరల్ అయింది. ఆ వీడియోలో వ్యక్తి AC అవుట్‌డోర్ యూనిట్‌కు కూలర్ గడ్డి చుట్టడం, నీళ్లు పోయడం వంటివి చేశాడు.
వైరల్ జుగాడ్
అయితే ఆ వీడియో చూపినట్టు అస్సలు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అలా చేస్తే ఏసీలు పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏసీ పేలకుండా ఉండాలంటే ఏం చేయాలో సూచించారు
నిపుణుల హెచ్చరిక
AC అవుట్‌డోర్ యూనిట్‌ను ఎప్పుడూ ఇరుకైన చోట కాకుండా, గాలి బాగా ఆడే బహిరంగ ప్రదేశంలో మాత్రమే అమర్చాలి.
గాలి ప్రసరణ ముఖ్యం
ఏకధాటిగా ఎక్కువ గంటలు AC వాడటం వల్ల కంప్రెషర్ ఓవర్ హీట్ అయ్యి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో విరామం ఇవ్వండి.
ఓవర్ హీటింగ్ సమస్య
పాత వైరింగ్ లేదా తక్కువ నాణ్యత గల ప్లగ్ పాయింట్స్ వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఎప్పుడూ నాణ్యమైన వైర్లనే వాడండి.
షార్ట్ సర్క్యూట్ నివారణ
అవుట్‌డోర్ యూనిట్ జాలిలో దుమ్ము పేరుకుపోతే వేడి గాలి బయటకు వెళ్లదు. దీనివల్ల మెషిన్ లోపల ఒత్తిడి పెరిగి ప్రమాదాలు జరుగుతాయి.
దుమ్ము - ధూళి
కనీసం ఏడాదికి రెండుసార్లు నిపుణులైన మెకానిక్‌తో పూర్తి స్థాయిలో సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి
క్రమం తప్పని సర్వీసింగ్
సరైన మెయింటెనెన్స్ లేకపోవడమే AC ప్రమాదాలకు ప్రధాన కారణం. కాబట్టి ఎప్పటికప్పుడు ఫిల్టర్లను, యూనిట్లను శుభ్రంగా ఉంచుకోండి.