AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC: ఏసీ ఆపినా గది చల్లగా ఉండాలా.. ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుంది..

ఎండలు మండిపోతున్నాయి.. ఉక్కపోత భరించలేక ఏసీ ఆన్ చేస్తే కరెంట్ మీటర్ పరుగులు తీస్తోంది. పోనీ బిల్లు భయంతో ఏసీ ఆపుదామంటే, ఐదు నిమిషాల్లోనే గది మళ్లీ నిప్పుల కొలిమిలా మారుతోంది. అయితే కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ ఉపయోగిస్తే ఏసీ ఆపేసిన తర్వాత కూడా గంటల తరబడి గదిని చల్లగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 18, 2026 | 9:14 PM

Share
24 డిగ్రీల మేజిక్: చాలా మంది ఏసీ ఆన్ చేయగానే గది త్వరగా చల్లబడాలని 16 లేదా 18 డిగ్రీల్లో పెడతాడు. దీనివల్ల గది త్వరగా చల్లబడదు సరే కదా కంప్రెసర్ పై విపరీతమైన భారం పడి కరెంట్ బిల్లు పెరుగుతుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రకారం.. మన శరీరానికి 24 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత సౌకర్యవంతమైనది. ఏసీని 24 డిగ్రీల వద్ద ఉంచితే కంప్రెసర్ తక్కువ శక్తిని వాడుకుంటుంది. దీనివల్ల బిల్లు సుమారు 20శాతం నుండి 30శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.

1 / 6
గోడల చల్లదనం: మీరు ఏసీని 15 నిమిషాలు వేసి ఆపేస్తే గాలి మాత్రమే చల్లబడుతుంది. కానీ గదిలోని గోడలు, ఫర్నిచర్, బెడ్ వంటివి వేడిగానే ఉంటాయి. ఏసీ ఆపగానే ఈ వస్తువుల నుండి వెలువడే వేడి గదిని మళ్లీ వేడెక్కిస్తుంది. అందుకే ఏసీని కనీసం ఒక గంట పాటు నిరంతరాయంగా నడవనివ్వాలి. అప్పుడు గదిలోని వస్తువులన్నీ చల్లబడి, ఏసీ ఆపిన తర్వాత కూడా ఆ చల్లదనాన్ని బయటకు వదులుతూ గదిని గంటల తరబడి కూల్‌గా ఉంచుతాయి.

2 / 6
థర్మల్ ఇన్సులేషన్:  గదిలో చల్లదనం నిలవకపోవడానికి ప్రధాన కారణం ఎయిర్ లీకేజీ. తలుపుల కింద, కిటికీ సందుల ద్వారా చల్లని గాలి బయటకు పోయి, బయట ఉన్న వేడి గాలి లోపలికి వస్తుంది. మార్కెట్లో దొరికే డోర్ బాటమ్ సీల్స్ వాడండి లేదా మందపాటి దుప్పటిని తలుపు కింద అడ్డంగా పెట్టండి. కిటికీలకు గ్లాస్ ఫిలిమ్స్ లేదా మందపాటి బ్లాక్‌అవుట్ కర్టెన్లు వాడితే సూర్యరశ్మి లోపలికి రాకుండా ఉంటుంది.

3 / 6
 సీలింగ్ ఫ్యాన్ మ్యాజిక్: ఏసీ నడుస్తున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ వేగంతో వాడటం వల్ల ఏసీ నుండి వచ్చే చల్లని గాలి గది మూలమూలలకు చేరుతుంది. ఏసీ ఆపివేసిన తర్వాత ఫ్యాన్ వేగాన్ని కొంచెం పెంచితే, గదిలో అప్పటికే ఉన్న చల్లని గాలిని అది రీ సర్క్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఏసీ ఆపిన తర్వాత కూడా మరో 1-2 గంటల పాటు ఏసీ అవసరం లేకుండానే హాయిగా నిద్రపోవచ్చు.

4 / 6
వేడిని పుట్టించే పరికరాలు: మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు చిన్నపాటి హీటర్లలా పనిచేస్తాయి. గదిలో పాతకాలపు ఫిలమెంట్ బల్బులు ఉంటే వెంటనే తీసేసి ఎల్‌ఈడీ బల్బులు వాడండి. టీవీ, కంప్యూటర్, ఓవెన్ వంటి పరికరాలు నడుస్తున్నప్పుడు గది ఉష్ణోగ్రత పెరుగుతుంది. అవసరం లేనప్పుడు వీటిని ఆపివేయడం వల్ల ఏసీపై భారం తగ్గుతుంది.

5 / 6
మెయింటెనెన్స్ టిప్స్: నెలకు రెండుసార్లు ఏసీ ఫిల్టర్లను మీరే తీసి నీటితో శుభ్రం చేయండి. దుమ్ము ఉంటే ఏసీ గాలిని సరిగ్గా పీల్చుకోలేదు. ఏటా వేసవికి ముందు ఒకసారి ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించడం వల్ల గ్యాస్ లీకేజీలు లేకుండా చూసుకోవచ్చు. ఈ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీరు వేసవిని హాయిగా గడపడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుతూ మీ కష్టార్జితాన్ని ఆదా చేసుకోవచ్చు.

6 / 6
Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే

'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ

పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?

ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి