AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు

Preventive Detention Act: విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బేత లల్లూ (23)పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు.

రౌడీయిజంపై ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్.. భయం భయంగా రౌడీ షీటర్లు
Police Crackdown on Rowdyism
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: May 18, 2026 | 10:48 PM

Share

విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేర ప్రవృత్తిని విడనాడకుండా వరుసగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న బేత లల్లూ (23)పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు. విజయనగరం పట్టణంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ గత కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2023వ సంవత్సరం నుంచి అతనిపై రెండు గంజాయి కేసులు, ఒక నైట్ దొంగతనం కేసు, మూడు సాధారణ దొంగతనం కేసులు, ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదయ్యాయి. మొత్తం ఏడు కేసుల్లో అతను అరెస్టయ్యాడు. ఇప్పటికే అతనిపై విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా కొనసాగుతోంది. అతని కార్యకలాపాలు ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు ముప్పుగా మారడంతో ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పీడీ యాక్ట్ కింద నిర్బంధించారు. అనంతరం అతడిని విశాఖ సెంటర్ జైలుకు తరలించారు.

ఈ నిర్బంధం ఒక సంవత్సరం వరకు అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఇటీవల పలువురు రౌడీ షీటర్లకు కూడా కౌన్సిలింగ్‌తో పాటు నేరుగా వారు నివసించే ప్రాంతాలకు వెళ్లి నేర ప్రవృత్తిని వీడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్పీ దామోదర్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బేతా లల్లూపై పీడీ యాక్ట్ ప్రయోగించడం రౌడీ షీటర్లు హడలెత్తిపోతున్నారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని.. గంజాయి, మాదక ద్రవ్యాలు, చైన్ స్నాచింగ్, దోపిడీలు, భూదురాక్రమణలు వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Follow Us