- Telugu News Photo Gallery Technology photos Vivo launching new 5g smart phone Vivo Y35 in india have a look on features and price details Telugu Tech News
Vivo Y35 5G: రూ. 15 వేలలోపు 5జీ స్మార్ట్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నారా.? అదిరిపోయే ఫీచర్స్‌తో వివో కొత్త ఫోన్..
ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తరుణంలో 5జీ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోఒంది. రూ. 15 వేలలోపు అందుబాటులోకి రానున్న వివో వై35 ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Dec 16, 2022 | 6:15 AM

వివో వై35 పేరుతో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌ను 4 GB RAM + 128 GB స్టోరేజ్, 6 GB RAM + 128 GB స్టోరేజ్ మరియు 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదల చేయనున్నారు.

4జీబీ వేరియంట్ ధర రూ. 14,138, 6 జీబీ వేరియంట్ ధర రూ. 16,521, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 17,672గా ఉండనున్నట్లు అంచనా. ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ కానుందన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇక ఈ ఫక్షన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 60HZ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 269 PPI పిక్సెల్ డెన్సిటీ, 120HZ టచ్ శాంప్లింగ్ రేట్, 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను ఈ స్క్రీన్ సొంతం.

ఇక ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, ఆరిజిన్ ఓఎస్ ఓషన్ యూఐతో ఈ ఫోన్ పనిచేయనుంది. స్టోరేజీ పెంచుకోవడానికి మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా అందుబాటులో ఉంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నారు.




