వాట్సాప్ యూజర్లకు సూపర్ గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్

28 April 2026

Pic credit - Instagram

Anand T

వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వచ్చే ట్రాఫిక్ సౌండ్స్, గాలి రొద వల్ల ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసమే ఈ కొత్త అప్‌డేట్

తన యూజర్లకు వాట్సాప్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్‌లో కొత్తగా నాయిస్ క్యాన్సలేషన్ అనే ఫీచర్ పరిచయం చేసింది.  

ఈ ఫీచర్ ఆన్ చేస్తే.. వాహనాల హారన్లు, గాలి హోరు వంటి బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు తగ్గిపోతాయి. మీ వాయిస్ అవతలి వారికి స్పష్టంగా వినిపిస్తుంది.

కాల్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటేనే బెస్ట్ ఆడియో క్వాలిటీ లభిస్తుంది. ఒకరు ఆన్ చేస్తే అవతలి వారికి మాత్రమే క్లియారిటీ ఉంటుంది.

కాల్ స్టార్ట్ అవ్వగానే కాలింగ్ మెనూలోనే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది డీఫాల్ట్‌గా పనిచేసేలా సెట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.14.1లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లందరికీ ఈ అప్‌డేట్ రానుంది.

దీంతో పాటు స్టోరేజ్ మేనేజ్‌మెంట్‌లో పెద్ద ఫైల్స్‌ను సులభంగా డిలీట్ చేసే ఫీచర్‌ను కూడా వాట్సాప్ అప్‌డేట్ చేసింది.

యూజర్ల ప్రైవసీ, సౌలభ్యం కోసం వాట్సాప్ ఎప్పికప్పుడూ సరికొత్త మార్పులు చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.