Nokia-C31 Phone: అదిరిపోయే ఫీచర్లతో నోకియా ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని రోజులు వస్తుందంటే..

నోకియా.. తన స్మార్ట్ ఫోన్ల వ్యాపారాన్ని మరింత విస్తరించాడానికి చూస్తుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు రానుంది. నోకియా సీ 31 పేరుతో కొత్త..

Nokia-C31 Phone: అదిరిపోయే ఫీచర్లతో నోకియా ఫోన్.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఎన్ని రోజులు వస్తుందంటే..
Nokia C31
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Dec 15, 2022 | 6:30 PM

నోకియా.. తన స్మార్ట్ ఫోన్ల వ్యాపారాన్ని మరింత విస్తరించాడానికి చూస్తుంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకు రానుంది. నోకియా సీ 31 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. దీని ద్వారా ప్రత్యర్థి కంపెనీలను గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. రూ.9,999 రేంజ్ లోనే ఫోన్ అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ అన్ని ఆఫ్ లైన్ స్టోర్లలోనూ, అలాగే నోకియా ఆన్ లైన్ స్టోర్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 సిస్టమ్ తో పని చేసే ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ బేస్ మోడల్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ దీని ధర రూ.9,999. అలాగే 4 జీబీ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఈ ఫోన్ డ్యుయల్ సిమ్ ఆప్షన్ ఉండడమే కాక 256 జీబీ వరకూ మెమరీని ఎక్స్ పాండ్ చేసే అవకాశం ఉంది. అయితే 5050 ఎంఏహెచ్ కెపాసిటీతో అతి పెద్ద బ్యాటరీ నోకియా సీ31 లో ఉంది. దీంతో ఈ ఫోన్ ను ఓ సారి ఫుల్ గా చార్జ్ చేస్తే మూడు రోజుల పాటు పని చేస్తుందని కంపెనీ చెబుతుంది. చార్ కోల్, మింట్ రంగుల్లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ మిగిలిన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

నోకియా సీ 31 స్పెసిఫికేషన్లు

☛ 6.74 ఇంచ్‌ల డిస్‌ప్లే

☛ 2.5 డీ టఫ్ ఎండ్ గ్లాస్ తో 1600×720 రిజుల్యూషన్ తో స్క్రీన్

ఇవి కూడా చదవండి

☛ 13 ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 2 ఎంపీ డెప్త్‌ సెన్సార్‌, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో ట్రిపుల్‌ కెమెరాలతో వస్తుంది.

☛ 5 ఎంపీతో ఫ్రంట్‌ కెమెరా

☛ 4.2 వెర్షన్‌ బ్లూ టూత్‌

☛ 3.5 ఎంఎం హెడ్‌ ఫోన్‌ జాక్‌ దీని ప్రత్యేకతలు

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి