Jio 5G Services: ఐఫోన్‌ వినియోగదారులకు జియో గుడ్‌న్యూస్‌.. ఆ ఫోన్‌లలో అపరిమిత 5జీ డేటా సేవలు

 దేశంలో ప్రస్తుతం 4జీ సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వివిధ టెలికాం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల కల నెరవేరుతోంది. టెక్నాలజీ..

Jio 5G Services: ఐఫోన్‌ వినియోగదారులకు జియో గుడ్‌న్యూస్‌.. ఆ ఫోన్‌లలో అపరిమిత 5జీ డేటా సేవలు
Jio 5g Services
Follow us
Subhash Goud

|

Updated on: Dec 15, 2022 | 3:01 PM

దేశంలో ప్రస్తుతం 4జీ సేవలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల వివిధ టెలికాం కంపెనీలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వినియోగదారుల కల నెరవేరుతోంది. టెక్నాలజీ పెరుగుతున్నకొద్ది దేశంలో ఇంటర్నెట్ సదుపాయం వేగం పెరుగుతోంది. 4జీ కంటే అధిక రెట్టింపుతో 5 జీ సేవలు వచ్చేశాయి. ఇక ఇతర నెట్‌వర్క్‌ల కంటే జియో మరింతగా దూసుకుపోతోంది. తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా 5జీలో వేగాన్ని పెంచింది. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందిస్తోంది. ఇక జియో ఐఫోన్‌ 12, తర్వాత వెర్షన్‌ మొబైల్‌ ఉన్నవారికి అపరిమిత డేటాలో 5జీ సేవలను ప్రారంభించింది. వినియోగదారులు ఈ రోజు నుంచి జియో ట్రూ 5జీ సేవలను అపరిమిత డేటాతో పొందుతారని రిలయన్స్‌ జియో గురువారం తెలిపింది.

వినియోగదారులు తాజా iPhone iOS క్యారియర్ సెట్టింగ్‌లకు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అపరిమిత 5G వినియోగాన్ని ప్రారంభించడానికి కంపెనీ వినియోగదారుల సంఖ్యలపై జియో వెల్‌కమ్ ఆఫర్‌ను అందించింది. ఐఫోన్‌ 12 మినీ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 మ్యాక్స్‌, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ ఉన్న వారు జియో 5జీ సేవలను యాక్సెస్‌ చేసుకోవాలని తెలిపింది.

Jio 5g Services

Jio 5g Services

నవంబర్ మొదటి వారంలో యాపిల్‌ తన ఐఫోన్‌ పరికరాలను భారతదేశంలో 5G కనెక్టివిటీని కంపెనీ బీటా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లకు తిరిగి ఇచ్చేలా అప్‌డేట్ చేయడం ప్రారంభించింది. ఆపిల్ నవంబర్ 11న iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను విడుదల చేయడం ప్రారంభించినట్లు ధృవీకరించింది. సాఫ్ట్‌వేర్‌ను iOS 16.2 లేదా తర్వాతి వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలని, ఆపై సెట్టింగ్‌ల నుండి 5Gని ట్రన్ చేసి, చివరకు 5G స్టాండలోన్‌ని ఆన్ చేయాలని జియో వినియోగదారులను కోరింది.

ఇవి కూడా చదవండి
Jio 5g Services

Jio 5g Services

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి