Indian Railways: ఆ ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే .. ఇక రాయితీ టికెట్లు ఉండవు.. స్పష్టం చేసిన కేంద్రం

భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు కూడా రాయితీ సదుపాయం కల్పిస్తుంటుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్లకు రాయితీ..

Indian Railways: ఆ ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే .. ఇక రాయితీ టికెట్లు ఉండవు.. స్పష్టం చేసిన కేంద్రం
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Dec 15, 2022 | 2:33 PM

భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక సీనియర్‌ సిటిజన్స్‌కు కూడా రాయితీ సదుపాయం కల్పిస్తుంటుంది. అయితే ఈ సీనియర్ సిటిజన్లకు రాయితీ సదుపాయాన్ని కరోనా సమయంలో నిలిపివేసింది రైల్వే శాఖ. ఇక రాయితీపై టిక్కెట్లను ఇప్పించడం వల్ల మళ్లీ అమలు చేయడం లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు . కోవిడ్ -19 మహమ్మారి తర్వాత రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు రాయితీ ఛార్జీల ఆఫర్‌ను నిలిపివేసింది. దీన్ని ప్రభుత్వ వర్గాలు, ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సీనియర్ సిటిజన్లకు మళ్లీ రాయితీ ధరలను అందించనున్నట్లు కొన్ని మీడియా ఇటీవల నివేదించింది. ఈ విషయమై లోక్ సభలో మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రణం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. సీనియర్ సిటిజన్లకు తగ్గింపు ధరలను మళ్లీ అమలు చేసే ప్రణాళిక ప్రస్తుతం లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ప్రయాణికుల సేవల కోసం రైల్వేకు 59,000 కోట్లు. సబ్సిడీ ఇచ్చారు. పింఛను, జీతాలు చాలా పెరిగాయని మంత్రి తెలిపారు. రైల్వే శాఖ వార్షిక పెన్షన్ మొత్తం రూ.60,000 కోట్లు ఉంది. గతేడాది 59,000 కోట్లు సబ్సిడీ ఇచ్చారు. ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా భారీ మొత్తం. ఇంధనం కోసం 40,000 కోట్లు ఖర్చుపెట్టారు. వేతనాలకు 97,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు అశ్విని వైష్ణవ్ లోక్ సభలో తెలియజేశారు.

దేశంలోని అన్ని ప్రాంతాల నుండి అయోధ్యకు రైలు కనెక్టివిటీ

కాగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యను కలుపుతూ రైలును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 41 ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి ప్రక్రియ పురోగతిలో ఉంది. దశలవారీగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం వందేభారత్ రైళ్లు గరిష్టంగా 500 కి.మీ. స్లీపింగ్ ఫెసిలిటీ రైళ్లను ప్రవేశపెట్టిన తర్వాత వందే భారత్ రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించడం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.

2030 నాటికి పూర్తిగా కాలుష్య రహితం

2030 నాటికి భారతీయ రైల్వేలు పూర్తిగా కాలుష్య రహితంగా మారుతాయి. ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. హైడ్రోజన్ రైళ్లను అభివృద్ధి చేస్తాం. వీటిని భారతీయ ఇంజనీర్లు డిజైన్ చేస్తారని వైష్ణవ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే