One plus: వన్‌ప్లస్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. 9వ వార్షికోత్సం సందర్భంగా వన్‌ప్లస్ గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్.
భారత్‌లో ఎక్కువగా ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్స్‌లో వన్‌ప్లస్ ఒకటి. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో ప్రొడక్ట్స్‌ను విడుదల చేశాయి. స్మార్ట్ ఫోన్‌ల తయారీతో..
భారత్‌లో ఎక్కువగా ప్రజాదరణ పొందిన చైనా బ్రాండ్స్‌లో వన్‌ప్లస్ ఒకటి. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో ప్రొడక్ట్స్‌ను విడుదల చేశాయి. స్మార్ట్ ఫోన్‌ల తయారీతో మొదలైన వన్‌ప్లస్ బ్రాండింగ్ టీవీలు, మానిటర్లుకు కూడా చేరింది. దీంతో భారత్‌లో వన్‌ప్లస్ బ్రాండ్స్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే వన్‌ప్లస్ 9వ వార్షికోత్సం సందర్భంగా తమ బ్రాండ్స్‌పై భారీగా ఆఫర్లను ప్రకటించింది. సేల్‌లో భాగంగా పలు గ్యాడ్జెట్లపై క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్‌లతో పాటు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే స్మార్ట్ టీవీలు, ఈయర్ బడ్స్, వాచ్‌లపై భారీగా డిస్కౌంట్‌లను అందిస్తోంది. డిసెంబర్ 13వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ పలు గ్యాడ్జెట్లపై అందిస్తోన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Oneplus 10T 5G:
ఈ ఫోన్ డిస్కౌంట్‌తో రూ. 44,999కి అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఈ స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో తీసుకుంటే అదనంగా మరో రూ. 10,000 డిస్కౌంట్ పొందొచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 4800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫొన్ సొంతం.
OnePlus 10 Pro 5G:
కంపెనీ ఆఫర్‌తో పాటు, బ్యాంక్ ఆఫర్‌లను కలుపుకుంటే వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 55,999కి అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్‌లో భాగంగా అదనంగా రూ. 10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పనిచేసే ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.7 ఇంచెస్ అమోఎల్‌ఈడీ స్క్రీన్ డిస్‌ప్లే ఈ ఫోన్ సొంతం.
OnePlus Nord 2T 5G:
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్‌లో భాగంగా రూ. 25,999గా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ గల ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌లో అదనంగా రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు. 6.43 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే అందించిన ఈ ఫోన్‌లో 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
OnePlus Monitor X 27:
వన్‌ప్లస్ తాజాగా ఎక్స్ 27 పేరుతో ఓ మానిటర్‌ను విడుదల చేసింది. సేల్‌లో భాగంగా ఈ మానిటర్‌ను రూ. 26,999కి అందిస్తోంది. 27 ఇంచెస్ 2కే క్యూహెచ్‌డీ ఐపీఎస్ స్క్రీన్‌తో పనిచేసే ఈ మానిటర్ హెచ్‌డీఆర్‌కు సపోర్ట్ చేయడం విశేషం. యూఎస్‌బీ – సీ పోర్ట్ ద్వారా సులభంగా డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
వీటితో పాటు వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లైస్ జెడ్2పై రూ. 1,699, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్‌పై రూ. 2499, వన్‌ప్లస్ బడ్స్ జెడ్2పై రూ. 4,499, వన్‌ప్లస్ బడ్స్ ప్రొపై రూ. 8,990, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈపై రూ. 1,899, వన్‌ప్లస్ నార్డ్ వైర్డ్ హెడ్‌ఫోన్స్‌పై రూ. 599, వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌పై రూ. 4,499 చొప్పున డిస్కౌంట్ అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..