Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫైర్ తో యువకుడు స్టంట్స్‌.. ప్యాంటుతో అగ్నిని ఆర్పే ప్రయత్నం.. నెక్స్ట్ ఏమి జరిగిందంటే..

వేదికపై ఒక యువకుడు నిప్పుతో విన్యాసాలు చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యువకుడు ఒక అగ్గి బరాటా తీస్కుని పైకి ఎగరవేసి అందుకోవడం మొదలు పెట్టాడు.

Viral Video: ఫైర్ తో యువకుడు స్టంట్స్‌.. ప్యాంటుతో అగ్నిని ఆర్పే ప్రయత్నం.. నెక్స్ట్ ఏమి జరిగిందంటే..
Man Perform Fire Stunt
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 12:56 PM

విన్యాసాలు చేయడం పిల్లల ఆట కాదు.. దీనికి చాలా సాధన అవసరం. అయితే నేటి యువత సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి స్టంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు. స్టంట్స్‌కి నిపుణుల పర్యవేక్షణలో చాలా హార్డ్ వర్క్ అవసరం.. అలా తర్ఫీదు పొందిన వ్యక్తి ఇతరులు ఆకట్టుకునే విధంగా విన్యాసాలు చేయవచ్చు. అయితే ఒకొక్కసారి కొందరు ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్ కూడా ఉత్సాహంతో చేసే పనులుతో తమపై తాము అదుపుకోల్పోతారు. తాము ఎంతో నైపుణ్యంగా చేసే సంట్స్ సమయంలో పొరపాట్లు చేస్తాడు. ఒకొక్కసారి గాయాల పాలు కూడా అవుతాడు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువతుడు నిప్పుతో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే చివరికి అది ఫన్నీగా ముగిసింది.. ప్రస్తుతం నవ్వుల పూయిస్తోంది ఈ వీడియో.

కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు. తాము నేర్చుకున్న స్టంట్స్ ను ఎప్పుడైనా ఎక్కడైనా ప్రదర్శిస్తారు. ఇలాంటి ప్రదర్శనలతో తమ గొప్పదనం గురించి పదిమందికి తెలియాలని భావిస్తారు. అంతేకాదు తమని తాము తెలివైనవారిగా భావించి.. చేసే సాహసాలతో అల్లరిపాలు కూడా అవుతారు. ఒక స్టంట్‌మ్యాన్ వేదికపై ఫైర్‌తో విన్యాసాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమై ఉన్న ఒక  వీడియో బయటపడింది. అతడు చేసే విన్యాసాలు చూసి జనాలు కూడా చప్పట్లు కొడుతున్నారు. దీంతో ఆ యువకుడు మరింత ఉత్సాహంగా సరికొత్త విన్యాసాలను చేయాలనీ భావించి చేసిన తప్పుతో ఘోరంగా విఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి

వీడియోలో.. వేదికపై ఒక యువకుడు నిప్పుతో విన్యాసాలు చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యువకుడు ఒక అగ్గి బరాటా తీస్కుని పైకి ఎగరవేసి అందుకోవడం మొదలు పెట్టాడు. ఈ స్టెంట్స్ లో భాగంగా పైకి ఎగరవేసిన ఫైర్ టార్చర్ ను తన ప్యాంటులో పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు నిప్పు కాగడా.. అని ప్యాంట్ లోపలి వెళ్ళింది. దీంతో ఆ యువకుడు భయాందోళనలకు గురయ్యాడు. అయితే అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు మంటలను ఎలాగోలా ఆర్పివేశారు.

ప్రతి స్టంట్ విజయవంతం అవ్వాలనే రూల్ లేదు. కొన్ని విన్యాసాలు మిమ్మల్నినవ్వించేలా ఉంటాయి.. కొన్ని తమ జీవితంతో తాము ఆడుకున్నట్లు అనిపిస్తాయి. తాజాగా ఫైర్ స్టంట్ చేసిన వ్యక్తికి అలాంటిదే జరిగింది. ఈ వీడియో..  వికాష్‌కుష్వాహా9011 అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.  ఇప్పటి వరకూ 11 వేల మందికి పైగా లైక్ చేయగా.. లక్షల మంది చూశారు. దీనితో పాటు.. వివిధ రకాల కామెంట్స్ ను చేస్తున్నారు నెటిజన్లు..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..