Viral Video: పెళ్లి పీటల మీద కూర్చుని క్రికెట్ ప్రతిభను ప్రదర్శించిన వరుడు.. నీ టెక్నీక్ సూపర్ భయ్యా అంటోన్న నెటిజన్లు

ప్రస్తుతం  అలాంటి వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఒక వరుడు తన పెళ్లిలో చేసిన పనికి చూసిన వారు నవ్వు కంట్రోల్ చేసుకోలేరు. వైరల్ అవుతున్న వీడియోలో, పెళ్లికి సంబంధించిన ఆచారాలను పూర్తి చేయడానికి పండితుడు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు

Viral Video: పెళ్లి పీటల మీద కూర్చుని క్రికెట్ ప్రతిభను ప్రదర్శించిన వరుడు.. నీ టెక్నీక్ సూపర్ భయ్యా అంటోన్న నెటిజన్లు
Wedding Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2022 | 9:43 PM

ఇప్పుడిప్పుడే పెళ్లిళ్ల సీజన్ తో సందడి మొదలైంది.  రకరకాల పెళ్లిళ్ల వీడియోలు సోషల్ మీడియాలో  దర్శనమిస్తున్నాయి . చెప్పాలంటే.. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన వీడియోలను చాలా ఆసక్తిగా చూడటానికి నెటిజన్లు ఇష్టపడుతున్నారని చెప్పడం తప్పు కాదు. అందుకే పెళ్లి వేడుకకి సంబంధించిన వీడియో ఎప్పుడు తెర‌పైకి వ‌చ్చినా వెంట‌నే వైర‌ల్ అవ‌డానికి ఇదే కార‌ణం. ప్రస్తుతం  అలాంటి వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఒక వరుడు తన పెళ్లిలో చేసిన పనికి చూసిన వారు నవ్వు కంట్రోల్ చేసుకోలేరు.

వివాహానికి ముందు, తరువాత ఇక్కడ వివిధ ఆచారాలు నిర్వహిస్తారు. జీలకర్ర బెల్లం,  తాళి, తలంబ్రాలు, సప్తపది, జయమాల వేడుక ఇలా సంప్రదాయానికి అనుగుణంగా రాకరాక పద్ధతుల్లో వివాహ వేడుకని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్నేహితులు, ఆహుతుల  నవ్వులు , జోకులతో సందడి నెలకొంటుంది. అయితే తాజా వైరల్ అవుతున్న వీడియో కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక వరుడు మండపంలో కూర్చొని తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కనిపించాడు. అది చూసి అక్కడున్న వారంతా నవ్వడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో, పెళ్లికి సంబంధించిన ఆచారాలను పూర్తి చేయడానికి పండితుడు కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. అదే సమయంలో..  వివాహ సంప్రాదయానికి అనుగుణంగా అగ్ని, పూజ కోసం ఏర్పాటు చేసిన అని కనిపిస్తున్నాయి. ఇంతలో ఓ  స్నేహితుడు వరుడివైపు ఒక పువ్వు విసిరాడు. అదే సమయంలో వరుడు ఒక అట్టలాంటి వస్తువుని తీసుకుని క్రికెట్ బ్యాట్ లా రెడీ చేసుకుని తనవైపు వస్తున్న బంతి పువ్వుని బాల్ కొట్టినట్లు కొట్టాడు. ఆ పువ్వు కొంచెం దూరం వెళ్లి పడింది. పెళ్లికొడుకు బ్యాటింగ్ చేసిన తీరు చూస్తుంటే.. అతను క్రికెట్ ప్రేమికుడా అనిపిస్తోందని అంటున్నారు.

ఈ వీడియోను వర్షగుమాష్ట అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 21 వేల మందికి పైగా లైక్ చేశారు. ‘వరుడి బ్యాటింగ్ నిజంగా పరిపూర్ణంగా ఉందని ఒకరు.. ‘ఇక్కడ అతని స్నేహితులు అతనిపై పూల వర్షం కురిపిస్తున్నారు అని మరొకరు.. వరుడు ఏమి అర్థం చేసుకున్నాడో తెలియడం లేదు అని మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ వీడియోను ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్లు

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..