Viral: ఆన్‌లైన్‌లో కనిపించిన భార్య, సోదరి ఫోటోలు.. తీరా ఏంటని చూసేసరికి కళ్లు బైర్లు..
మసాజ్ సర్వీస్ కోసం ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. అతడ్ని షాక్‌కు గురి చేస్తూ భార్య, సోదరి ఫోటోలు కనిపించాయి.
మసాజ్ సర్వీస్ కోసం ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. అతడ్ని షాక్‌కు గురి చేస్తూ భార్య, సోదరి ఫోటోలు కనిపించాయి. తీరా ఏంటని చూసేసరికి అక్కడ ఓ మొబైల్ నెంబర్ ఉంది. దానికి ఫోన్ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని నకిలీ సైట్లు అందమైన అమ్మాయిలు, మహిళల ఫోటోలను వినియోగిస్తూ యదేచ్చగా వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ముంబైకు చెందిన ఓ వ్యక్తి మసాజ్ సర్వీస్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతుండగా.. అతడికి ఓ సైట్‌లో తన భార్య, సోదరి ఫోటోలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అయితే ఈలోపు తేరుకుని అందులో ఇచ్చిన నెంబర్‌కు కాల్ చేయగా.. అవతల నుంచి రేష్మా యాదవ్ అనే మహిళ మాట్లాడింది. మసాజ్ కోసం సదరు ప్రాంతానికి రావాలంటూ సూచించింది. ఆ వ్యక్తి తన భార్య, సోదరిని తీసుకుని రేష్మా చెప్పిన ప్లేస్‌కు వెళ్లాడు. అక్కడే స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో ఆమెను కలిశాడు. ‘ఎందుకు మావాళ్ల ఫోటోలను ఇలా అసభ్యకరంగా మార్చారు’ అంటూ రేష్మాతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. సదరు వ్యక్తి పట్టుకుని చివరికి పోలీసులకు అప్పగించాడు. ఇక ఖాకీలు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాలు బయటపడ్డాయి. తమ చీకటి వ్యాపారానికి ఇలా గుర్తు తెలియని యువతులు, మహిళల ఫోటోలను తీసుకుని వినియోగిస్తామని రేష్మా విచారణలో చెప్పింది. కాగా, రేష్మా వెనుక మరికొందరు కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేసి వారికి దర్యాప్తు చేస్తున్నారు.