AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Food Service : రైల్వేస్ అందించే భోజనంపై లోక్‌సభలో చర్చ.. దీనిపై రైల్వే శాఖ మంత్రి ఏమన్నారంటే..

మనందరం రైలు ప్రయాణం చేసే ఉంటాం కదా.. ప్రయాణ సమయంలోని చాలా సందర్భాలలో మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొక తప్పదు. రైలు టికెట్‌తో పాటు కొందరు భోజనాన్ని కూడా ఆర్డర్..

IRCTC Food Service : రైల్వేస్ అందించే భోజనంపై లోక్‌సభలో చర్చ.. దీనిపై రైల్వే శాఖ మంత్రి ఏమన్నారంటే..
Indian Railways And Irctc
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 15, 2022 | 11:33 AM

Share

మనందరం రైలు ప్రయాణం చేసే ఉంటాం కదా.. ప్రయాణ సమయంలోని చాలా సందర్భాలలో మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొక తప్పదు. IRCTC పోర్టల్ ద్వారా రైలు టికెట్‌తో పాటు కొందరు భోజనాన్ని కూడా ఆర్డర్ చేసుకుంటారు. అలా చేసుకునేవారికి ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. సరిగా ఉడకని భోజనం, నాణ్యత లేకపోవడం, కొన్ని సందర్భాలలో దుర్వాసనతో ఉంటాయి రైల్వే శాఖ వారు అందించేవి. ఇప్పుడు వాటి గురించి కూడా లోక్‌సభలో చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్టవ్ తెలిపిన సమాచారం ప్రకారం గడిచిన 7  నెలలో దాదాపు 6 వేల ఫిర్యాదులు ఆహార నాణ్యత మీదనేనట. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఆడిగిన  ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ..‘‘ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)కి గత ఏడు నెలల్లో భారతీయ రైల్వే రైళ్లలో ప్రయాణించేవారి  నుంచి ఆహారం నాణ్యతకు సంబంధించి 5,869 ఫిర్యాదులు అందాయ’’ని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఆహార నాణ్యతపై ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే IRCTC సర్వీస్ ప్రొవైడర్‌పై జరిమానాతో సహా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అన్ని రకాల ప్రీమియం రైళ్లలో (రాజధాని, శతాబ్ది, దురంతో, గతిమాన్, తేజస్, వందే భారత్) ‘ఆప్షనల్ క్యాటరింగ్ సర్వీస్’ని కూడా ప్రవేశపెట్టామని.. అవి 2019 సెప్టెంబర్ నాటి నుంచి అమలులోకి వచ్చాయని ఆయన తెలియజేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాల ప్రకారం ప్రయాణికులకు మంచి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం భారతీయ రైల్వే చేస్తున్న నిరంతర ప్రయత్నమని కేంద్ర మంత్రి చెప్పారు.

‘‘ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రయాణీకులు టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలోనే,  ప్రీ-పెయిడ్ క్యాటరింగ్ సౌకర్యాలను నిలిపివేసేందుకు ఆప్షన్ అందించడం జరిగింది’’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా, IRCTC తన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌ సేవలను అందించడమే కాక రైళ్లలో ప్రయాణించే ప్రయాణీకులందరికీ ఆహారాన్ని కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..