Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Vishnu: పెళ్లి చేసుకోమన్న ఒత్తిడికి విసిగి.. శ్రీ మహా విష్ణువును సంప్రదాయంగా పెళ్లి చేసుకున్న యువతి..

మానవుడిని కాకుండా దేవుడిని పెళ్లి చేసుకుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడిగితే .. తన తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి తాను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు పూజ వెల్లడించింది. పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని నమ్మి.

Lord Vishnu: పెళ్లి చేసుకోమన్న ఒత్తిడికి విసిగి.. శ్రీ మహా విష్ణువును సంప్రదాయంగా పెళ్లి చేసుకున్న యువతి..
Woman Marries Lord Vishnu
Follow us
Surya Kala

|

Updated on: Dec 19, 2022 | 9:54 PM

నేటి ప్రపంచంలో వివాహితకే సరైన రక్షణ లేదు.. ఇక అవివాహితకు సమాజంలో ఎలాంటి రక్షణ ఉంటుందో ఊహించాల్సిందే.. ఇక దానికి తగినట్లు.. సమాజంలో పెళ్లికాని యువతి అంటే చిన్న చూపు.. అంతేకాదు తెలిసిన వారు, తెలియని వారు కూడా పెళ్లికాని యువతులకు పెళ్లి చేసుకోమని నిరంతరం ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు. ఇలాంటి సలహాలకు విసుగు చేసిన ఓ మహిళ వివాహ ఒత్తిళ్లకు లొంగిపోయి పెళ్లి చేసుకోవాలని  నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే ఆ యువతి అందరికీ ఓ రేంజ్ లో ట్విస్ట్ ఇచ్చింది. తాను పెళ్లి చేసుకునే వరుడు విష్ణు భగవంతుడు అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా సంప్రదాయంగా భర్తగా చేసుకుంది ఆ యువతి. ఈ వింత ఘటన రాజస్తాన్ లో చోటు చేసుకుంది. డిసెంబరు 8న జైపూర్‌లోని గోవింద్‌గఢ్‌కు సమీపంలోని గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల పూజా సింగ్.. హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తూ..  గణేష్ పూజ , సప్తపది, అగ్ని సాక్షితో వివాహం చేసుకుంది. అయితే ఆమె పెళ్లిలో సింగ్‌కు వరుడు లేడు. వధువు పూజా సింగ్… శ్రీ మహా విష్ణువు భక్తురాలు. తాను దేవునితో ముడి పడాలని నిర్ణయించుకుంది. పూజా సింగ్ చేసుకున్న వివాహానికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చాలా దృష్టిని ఆకర్షించాయి. పసుపు రంగు దుస్తులు ధరించిన మహిళ ఎంతో సంతోషంగా కనిపించింది. మానవుడిని కాకుండా దేవుడిని పెళ్లి చేసుకుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడిగితే .. తన తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాన్ని చూసి తాను వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు పూజ వెల్లడించింది. పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయని నమ్మి.. తాను జీవితంలో ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడని నిర్ణయం తీసుకుంది.. పెళ్లి గురించి కలల్లో కూడా ఆలోచించకూడని భావించింది.

ఇవి కూడా చదవండి

దురదృష్టవశాత్తు.. చుట్టుపక్కల వారు ఆమె నిర్ణయాన్ని గౌరవించలేదు. అంతేకాదు 30 ఏళ్లు వచ్చాయి.. ఇంకా పెళ్లి చేసుకోవా అనే ప్రశ్నలతో పాటు అనేక రకాల ఉచిత సలహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో విసిగిపోయిన పూజ సింగ్ చివరకు పెళ్లితో అందరి నోటికి మూత వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఎంతమంది ఎన్ని విధాలా విమర్శించినా సింగ్ వాటిని పట్టించుకోలేదు.

పూజా సింగ్ శ్రీ విష్ణువు ని వివాహ చేసుకున్న తర్వాత ఆలయంలో విష్ణువు కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంది. ప్రజలు ఆమెను ఆటపట్టించినప్పటికీ.. తాను విష్ణువును తన భాగస్వామిగా స్వీకరించినట్లు పేర్కొంది. అయితే కొందరు నీ జీవితం నీది.. నీకు నచ్చినట్లు నీ స్వంత నిర్ణయం తో జీవించమని ప్రోత్సహించేవారు మరికొందరు ఉన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..