చెత్త కుప్పలో దొరికిన పాత జీన్స్..94 లక్షలకు అమ్ముడుపోయింది !!
పురాతన వస్తువులు వేలంలో భారీ ధరకు అమ్ముడు పోవడం మనకు తెలుసు. కానీ చెత్త కుప్పలో దొరికిన ఓ పాత చిరిగిపోయిన జీన్స్ ఫ్యాంట్ ఏకంగా 94 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం.
పురాతన వస్తువులు వేలంలో భారీ ధరకు అమ్ముడు పోవడం మనకు తెలుసు. కానీ చెత్త కుప్పలో దొరికిన ఓ పాత చిరిగిపోయిన జీన్స్ ఫ్యాంట్ ఏకంగా 94 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన తెల్లటి రంగులో ఉన్న జీన్స్ USAలోని నార్త్ కరోలినాలోని ఓడ శిథిలాల్లో దొరికింది. నివేదికల ప్రకారం, 1857లో ఈ ఓడ మునిగిపోయింది. ఈ జీన్స్ ను అదే ఓడకి చెందిన శిథిలాల నుండి కనుగొన్నారు. అంటే ఇప్పుడు ఈ జీన్స్‌కు సుమారు 165 ఏళ్లు. అలాంటి పరిస్థితిలో వేలం వేయగా వేలంలో దాదాపు 94 లక్షల రూపాయలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ చారిత్రాత్మక జీన్స్‌ను ఎవరు తయారు చేశారనే దానిపై గందరగోళం నెలకొంది. ఈ జీన్స్‌లు లెవీ స్ట్రాస్ & కో కంపెనీ తయారు చేసింది కావచ్చని కొందరు అంటున్నారు. అయితే అధికారికంగా.. ఈ కంపెనీ 1873 సంవత్సరంలో తన మొదటి జీన్స్‌ను తయారు చేసింది. మరికొందరు ఈ ఏ కంపెనీ జీన్స్ అంటే.. అప్పట్లో లెవీ స్ట్రాస్ కంపెనీ డ్రై గూడ్స్ అనే హోల్‌సేల్ కంపెనీ ఉండేదని.. ఇప్పుడు ఓడలోని ‘చెత్త కుప్ప’లో దొరికిన ఈ జీన్స్.. ఆ కంపెనీకి చెందినది కావచ్చని.. జీన్స్ ప్యాంటు ప్రపంచంలో తొలి వెర్షన్ కావచ్చని కొందరు అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లిలో క్రేజీ సీన్.. ఎంజాయ్ చేసిన వధూవరులు..
ఏటీఎంలో జింక.. ఎందుకో తెలిస్తే అయ్యో పాపం అంటారు
కట్నంగా కారు తేలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా ??
బోర్ కొట్టడంతో.. సరదాగా బ్యాంక్ చోరీ చేసిన వ్యక్తి !!
రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..