Lionel Messi: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ‘కాంతార’ క్లైమాక్స్.. మెస్సీకి అండగా మారడోనా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!
Lionel Messi: ‘కాంతార’ సినిమా క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ప్రజాధరణ లభించింది. థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తోంది ఈ సినిమా. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. కాంతార సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో

‘కాంతార’ సినిమా క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ప్రజాధరణ లభించింది. థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తోంది ఈ సినిమా. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. కాంతార సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్ చక్కర్లు కొనడుతున్నాయి. ఆ సినిమాలోని పాటలు, ఆ సినిమాలోని సీన్స్ ఇలా కీలక అంశాలపై మీమ్స్ తెగ రచ్చ చేస్తున్నాయి. అయితే, ఈ మీమ్స్ ఫీవర్ తాజాగా ఫిఫా వరల్డ్ కప్ 2022 కి పట్టుకుంది. ‘కాంతార’ థీమ్‌లో అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ, డిగో మారడోనాల పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
కాంతార సినిమాలోని క్లైమాక్స్ సీన్ మాదిరిగా.. మైదానంలో లియోనెల్ మెస్సీ అలసిపోయి పడిపోతే డియెగో మారడోనా దేవుడిలా వచ్చి అతన్ని నిద్రలేపుతాడట. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మస్సీ, మారడోనాల మీమ్స్ పోస్టర్‌పై అందరూ ఆసక్తి చూపుతున్నారు. కాంతార ప్రేక్షకులు, ఫుట్‌బాల్ ప్రేమికులు ఈ మీమ్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మీమర్స్ క్రియేటివిటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.




డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి తీసిన ‘కాంతార’ సినిమా కన్నడ, తెలుగు, తమిళ సహా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలైంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అయితే, కాంతార క్లైమాక్స్ సీన్స్ హైలెట్ అయ్యాయి. వాటిపై సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ నడుస్తు్న్నాయి.
వైరల్ అవుతున్న ఫోటో ఇదే..
Messi and Maradona ( Kantara Inspired) Hats off to whoever done this edit#FIFAWorldCup pic.twitter.com/ZXLiunReue
— Mr.S (@SarangSuresh95) December 18, 2022
మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..