Shocking Video: ఛీ ఛీ మరీ ఇలా ఉంటారా? హోటల్‌లో నగ్నంగా రెచ్చిపోయిన ఫారన్ టూరిస్ట్..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫారన్ టూరిస్ట్ రెచ్చిపోయింది. నగ్నంగా గది నుంచి బయటకొచ్చి రచ్చ చేసింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫారన్ టూరిస్ట్ రెచ్చిపోయింది. నగ్నంగా గది నుంచి బయటకొచ్చి రచ్చ చేసింది. అంతటితో ఆగకుండా.. హోటల్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసింది. హోటల్ సిబ్బంది ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ.. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరిపైనా దాడి చేసింది. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విదేశీ టూరిస్ట్ కేకలు వేస్తూ, సిబ్బందిపై దాడి చేసిన వైనాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవికాస్తా వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలో సదరు మహిళ ఒంటిపై బట్టలు లేకుండానే బయటకు వచ్చింది. హోటల్ లేడీ సిబ్బందిని దారుణంగా కొట్టింది. ఒక మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని పిడిగుద్దులు గుద్దింది. దాంతో ఆగ్రహానికి గురైన మహిళ.. పోలీసులను పిలవాలంటూ ఇతర సిబ్బందిని కోరింది. దాడి చేస్తున్న టూరిస్ట్ చెర నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లిపోయింది. అదే సమయంలో మరో వ్యక్తి ఆ టూరిస్ట్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. మరింత రెచ్చిపోయింది. అతన్ని సైతం కాలితో తన్నుతు, పంచ్‌లు ఇస్తూ బీభత్సం సృష్టించింది. అయితే, ఈ విదేశీ టూరిస్ట్ ఇంత రచ్చ చేయడానికి గల కారణం ఏంటనేది మాత్రం తెలియదు. మొత్తానికి ఆమె చేసిన రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సదరు టూరిస్ట్ డ్రగ్స్, మద్యం మత్తులో ఉన్నట్లుందని, అందుకే ఆమె అంతలా రెచ్చిపోయిందని అభిప్రాయపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే ఆమెకు అండగా కామెంట్స్ చేస్తున్నారు. హోటల్ సిబ్బందిని ఆమెను ఏదో అని ఉండొచ్చని, ఆ కారణంగానే ఆమె ఆగ్రహంతో ఊగిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
#CovidIsntOver yet and another lethal virus named #Feminism virus is spreading like wildfire in our country. This virus can make ur life hell nywhere and there is no vaccine or treatment for it. Scene at one of the 5 star hotel of Jaipur#FreeSpeech #BollywoodKiGandagi #newindia pic.twitter.com/hcqFUJ5QJw
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) December 16, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..