Shocking: అబ్బర బిడ్డ.. కిలో ‘టీ’ పొడి రూ.1.15 లక్షలు.. ఎక్కడో కాదు మనవద్దనే..

అస్సాంకు చెందిన మనోహరి గోల్డ్ టీ రికార్డును బద్దలు కొట్టింది. కిలో టి పొడి ఏకంగా రూ. 1.15 లక్షలకు అమ్ముడు పోయింది. తూర్పు అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని ఒక ఎస్టేట్‌లో

Shocking: అబ్బర బిడ్డ.. కిలో ‘టీ’ పొడి రూ.1.15 లక్షలు.. ఎక్కడో కాదు మనవద్దనే..
Manohari Gold Tea
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 18, 2022 | 10:18 PM

అస్సాంకు చెందిన మనోహరి గోల్డ్ టీ రికార్డును బద్దలు కొట్టింది. కిలో టి పొడి ఏకంగా రూ. 1.15 లక్షలకు అమ్ముడు పోయింది. తూర్పు అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలోని ఒక ఎస్టేట్‌లో పండించిన అరుదైన మనోహరి గోల్డ్ టీ ని ఇటీవల వేలం వేశారు. ఈ వేలంలో కిలోకు రూ. 1.15 లక్షలు పలికింది. తద్వారా గత రికార్డులన్నింటినీ ఇది బద్దలుకొట్టింది. అయితే, హైదరాబాద్‌కు చెందిన నీలోఫర్ కేఫ్ ఈ టీ ని తన క్లయింట్స్‌ కోసం కొనుగోలు చేసింది. అలాగే హైదరాబాద్, ఇతర ప్రాంతాలలోని కేఫ్‌ల కోసం హ్యాండ్‌మేడ్ టి కొనుగోలు చేశారు. హాట్ ఫేవరెట్ మనోహరి గోల్డ్ టి రికార్డ్ లెవల్‌లో అమ్ముడుపోవడం నిజంగా తేయాకు పరిశ్రమకు శుభపరిణామం అని మనోమరి టీ మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ లోహియా పేర్కొన్నారు.

లోహియా మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్లుగా, మేము మనోహరి గోల్డ్‌ టి ని తయారు చేస్తున్నాం. ఈ టీ కి రోజురోజుకు డిమాండ్, టీ పై ఇష్టం పెరుగుతోంది. ఈ సంవత్సరం మా ఉత్పత్తులను కిలో 1.15 లక్షల రూపాయలకు విక్రయించాం. ఇది అస్సాం, టీ పరిశ్రమకు శుభవార్త. కోల్‌కతాకు చెందిన ప్రైవేట్ పోర్టల్ ద్వారా టీ విక్రయించడం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన నీలోఫర్ కేఫ్ ఈ టీ ని కొనుగోలు చేసింది.’’ అని చెప్పారు.

కాగా, ఇప్పటి వరకు, ఎగువ అస్సాంలోని ఎస్టేట్‌లో పండిన టి కి మాత్రమే అత్యధికంగా రూ.99,999 ధర ఉంది. అయితే డిసెంబర్ 16న దిగువ ఎస్టేట్‌లో పండించిన టి గత రికార్డును బద్దలు కొట్టి రూ.1.15 లక్షలకు అమ్ముడుపోయింది. డిసెంబర్ 2021లో గౌహతి టీ వేలం కేంద్రం (GTAC)లో మనోహరి గోల్డ్ టీ కిలో రూ. 99,999 పలికింది. మనోహరి టీ గతంలో ప్రీమియం ఉత్పత్తి కిలో రూ.75,000 రికార్డు ధరకు విక్రయించడం జరిగింది. డికోమ్ టీ ఎస్టేట్ గోల్డెన్ బటర్‌ఫ్లై టీని 2020లో కిలోకు రూ. 75,000కి విక్రయించింది. తర్వాత, గౌహతి వేలంలో, అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్‌లోని డోనీ పోలో టీ ఎస్టేట్ ఉత్పత్తి చేసిన స్పెషాలిటీ టీ అదే ధరను పొందింది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. 850 కంటే ఎక్కువ పెద్ద తేయాకు తోటలతో అస్సాం ప్రపంచంలోనే అతిపెద్ద తేయాకు సాగు చేస్తున్న ప్రాంతంగా నిలిచింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం టీ లో 52 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. కానీ 2014 నుండి ధరల స్తబ్దత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల ఫలితంగా పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..