Shane Warne Prediction: సంచలనం సృష్టించిన షేన్ వార్న్ శిష్యుడు.. పాకిస్తాన్‌కు సుస్సు పోయించాడు..
ప్రపంచ లెగ్ స్పిన్నర్లలో షేన్ వార్న్ ఒకడు. ఈ లెజెండరీ ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ ప్రపంచంలోని ప్రతి పిచ్‌లో తన స్పిన్ మాయాజాలంతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను సైతం హడలెత్తించాడు. వార్న్ గొప్ప ప్లేయర్ మాత్రమే కాదు..
ప్రపంచ లెగ్ స్పిన్నర్లలో షేన్ వార్న్ ఒకడు. ఈ లెజెండరీ ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ ప్రపంచంలోని ప్రతి పిచ్‌లో తన స్పిన్ మాయాజాలంతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను సైతం హడలెత్తించాడు. వార్న్ గొప్ప ప్లేయర్ మాత్రమే కాదు.. అతనిలో మరికొన్ని ముఖ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయి. వార్న్‌కి ప్రతిభను ఎలా గుర్తించాలో బాగా తెలుసు. 2008లో IPL మొదటి సీజన్‌లో షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్‌ను విజేతగా నిలిచింది. ఈ ఏడాది మార్చిలో వార్న్ కన్నుమూశాడు. అయితే, అంతకు ముందు వార్న్ ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువ ఆటగాడి గురించి కీలక అంశాలు చెప్పాడు. ఇప్పుడది నిజమైంది.
ప్రస్తుతం పాక్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ కరాచీలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ యువ లెగ్ స్పిన్నర్ రెహ్మాన్ అహ్మద్‌కు అరంగేట్రం చేశాడు. ఈ ప్లేయర్ రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి అదరగొట్టాడు.
వార్న్ ముందే చెప్పాడు..
అహ్మద్ మంచి భవిష్యత్ ఉన్న ప్లేయర్ అని వార్న్ చెప్పాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాన్ని వార్న్ చెప్పాడు. కొన్ని రోజుల క్రితం వార్న్ ఒక యువ ఆటగాడిని కలుసుకుని అతని బౌలింగ్‌ను ప్రశంసించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఆటగాడు మరెవరో కాదు.. అప్పటికి 15 సంవత్సరాలు కూడా లేని అహ్మద్. అహ్మద్‌తో వార్న్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన బౌలింగ్. నేను నిన్ను నిశితంగా గమనిస్తూ ఉంటాను. మీరు 15 ఏళ్లలోపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడతారని అనుకుంటున్నాను.’’ అని అన్నారు.
అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించాడు..
అహ్మద్ ఈ సంవత్సరం ప్రారంభంలో అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ప్రపంచ కప్‌లో జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ పర్యటనలో భాగంగా అహ్మద్‌కు టెస్ట్ జట్టులో అవకాశం ఇచ్చారు.
అహ్మద్ రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అహ్మద్ మొత్తం 7 వికెట్లు తీశాడు. 1933 తర్వాత ఇంగ్లండ్‌లో లెగ్ స్పిన్నర్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 1933లో ఇంగ్లండ్‌కు చెందిన సిఎస్ మారియట్ వెస్టిండీస్‌పై 96 పరుగులిచ్చి 11 వికెట్లు పడగొట్టాడు.
షేర్ వార్న్ వీడియో..
This old video of Shane Warne telling a 13 year old Rehan Ahmed that he’ll be playing first-class cricket by 15 is really heartwarming.Shane Warne will be so proud of Rehan taking his first of many test match wickets & watching his every step❤️? #PAKvENG pic.twitter.com/BhPVXNrIX9
— James (@Surreycricfan) December 17, 2022
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..