Viral Video: రనౌట్ అయినా ఈ బ్యాట్స్‌మెన్ ఔట్ కాలేదు.. హాఫ్ సెంచరీతో స్వైర విహారం చేశాడు.. అదెలా సాధ్యమైందంటే..

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అది యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్యర్యానికి గురి చేసింది.

Viral Video: రనౌట్ అయినా ఈ బ్యాట్స్‌మెన్ ఔట్ కాలేదు.. హాఫ్ సెంచరీతో స్వైర విహారం చేశాడు.. అదెలా సాధ్యమైందంటే..
Rilee Rossouw
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 20, 2022 | 9:30 AM

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అది యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ఔటైన తర్వాత కూడా బ్యాట్స్‌మెన్ నాటౌట్‌గా నిలిచాడు. బ్యాట్స్‌మెన్ రనౌట్ అయినట్లు రీప్లేలలో స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్ సిడ్నీ థండర్, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగింది. సిడ్నీ బ్యాట్స్‌మెన్ రిలే రస్సో రనౌట్ అయినప్పటికీ అతను పెవిలియన్‌కు చేరుకోలేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో రిలే రూసో హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని మెల్‌బోర్న్ జట్టు ఈజీగా చేధించి విజయం సాధించింది.

ఈ కారణంగా రూసో బతికిపోయాడు..

సిడ్నీ ఇన్నింగ్స్ 11వ ఓవర్ జరుగుతోంది. టామ్ రోజర్స్ బౌలింగ్ చేస్తున్నాడు. రోజర్స్ ఐదో బంతిని షార్ట్ ఫుల్ టాస్ విసిరాడు. రూసో ఆడలేకపోయాడు. బంతి ప్యాడ్లకు తగడంతో అప్పీల్ చేశారు. ఇంతలో రస్సో పరుగు తీయడానికి ప్రయత్నించాడు. అయితే అవతలి ఎండ్‌లో ఉన్న అలెక్స్ రాస్ ఇటు వచ్చేశాడు. ఇంతలో ఫీల్డర్ స్ట్రెయిట్ త్రో స్టంప్‌ను కొట్టాడు. రూసో రనౌట్ అయ్యాడు. అయితే, బంతి ప్యాడ్‌కు తగలడంతో బౌలర్ అప్పీల్ చేయగా.. అంపైర్ రూసోని ఔట్‌గా ప్రకటించాడు. ఒకసారి అంపైర్ నిర్ణయం వచ్చాక ఆ బాల్ డెడ్‌గా పరిగణించడం జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో రూసో రనౌట్ చెల్లకుండా పోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక రూసో ఎల్‌బిడబ్ల్యూకి వ్యతిరేకంగా రివ్యూ తీసుకున్నాడు. అందులో నాటౌట్‌గా వచ్చింది. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇదన్నమాట రూసో రనౌట్ కథ.

మ్యాచ్ ఇలా జరిగింది..

ఈ మ్యాచ్‌లో రూసో 38 బంతులాడి మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. అలెక్స్ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. చివరిగా ఒలివర్ డేవిస్ 18 బంతుల్లో 33 పరుగులతో వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. డేవిస్ నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. వీరందరి సహకారంతో సిడ్నీ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ లక్ష్యాన్ని మెల్‌బోర్న్ 19.5 ఓవర్లలోనే సాధించింది. ఆరోన్ ఫించ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్ 43 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి కెప్టెన్ నిక్ మాడిసన్ 39 పరుగులు చేసి సపోర్ట్‌గా నిలిచాడు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే