Optical illusion: దీని తస్సాదియ్య.. దొరికితే ఒట్టు.. రహస్యంగా దాక్కున్న ‘8’.. కనిపెట్టే సత్తా మీలో ఉందా?

Optical illusion: మనం ఏదైనా వస్తువును, పరిసరాలను, ఆకాశాన్ని, భూమిని పరీక్షిస్తూ చూసినప్పుడు అక్కడ రకరకాల ఆకారాలు ఉన్నట్లు కనిపిస్తుంటుంది. దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు.

Optical illusion: దీని తస్సాదియ్య.. దొరికితే ఒట్టు.. రహస్యంగా దాక్కున్న ‘8’.. కనిపెట్టే సత్తా మీలో ఉందా?
Optical Illusion
Follow us

|

Updated on: Dec 18, 2022 | 9:52 PM

మనం ఏదైనా వస్తువును, పరిసరాలను, ఆకాశాన్ని, భూమిని పరీక్షిస్తూ చూసినప్పుడు అక్కడ రకరకాల ఆకారాలు ఉన్నట్లు కనిపిస్తుంటుంది. దానినే ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. అలాంటి భ్రమను కలిగించే ఫోటోలు కూడా ఉంటాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో పైకి ఒక దృశ్యం కనిపిస్తే.. అందులో నిగూఢంగా మరికొన్ని దృశ్యాలు దాగుంటాయి. ఆ దాగి ఉన్న వాటిని కనిపెట్టడమే ఇక్కడ టాస్క్. ఈ టాస్క్ చేజ్ చేయడం వల్ల, రహ్యాన్ని కనిపెట్టడం వల్ల మన మెదడు పనితీరు మెరుగు పడటమే కాదు.. కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది.

తాజాగా అంటాంటి అద్దిరిపోయే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మందికి పేకాట అంటే ఇష్టం. టైమ్ పాస్ కోసమే, బెట్టింగ్ పెట్టో ఆడుతుంటారు. రమ్మీ ఆన్‌లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి. అది వేరే విషయం గానీ.. తాజాగా వైరల్ అవుతున్న ఫోటో కూడా పేకాటలో భాగమైన డైమండ్ కార్డే. ఈ కార్డుపై 8 డైమండ్స్ ఉంటాయి. అదే సమయంలో పై చివరన, కింద చివరన రెండు 8 నెంబర్లు ఉంటాయి. కానీ, ఈ ఆప్టికల్ ఇమేజ్‌లో మాత్రం కనిపించని మరో 8 కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇదే మీకు మీమిచ్చే అతిపెద్ద టాస్క్. ఈ కార్డులో కనిపించని, రహస్యంగా ఉన్న మూడో 8 ఎక్కడ ఉందో చెప్పాలి. ఆ సీక్రెట్‌ 8ని మీరు గనుక కనిపెడితే నిజంగా మీకు ఐక్యూ చాలా ఎక్కువగా ఉన్నట్లే చెప్పుకోవచ్చు. అలాగే మీ బ్రెయిన్ షార్ప్ కూడా. అయితే, ఇక్కడ చిన్న కండీషన్ ఉంది. ఈ ఫోటోలో దాగున్న సీక్రెట్ 8 ని కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టాలి. టైమ్ ఎక్కువ తీసుకుని ఎవరైనా కనిపెడతారు.. కానీ, టైమ్ లిమిట్‌లో కనిపెట్టేవారే నిజమైన ఖతర్నాక్‌లు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ప్రయత్నించండి. ఆ రహస్య 8 ని కనిపెట్టండి.

కనిపెట్టలేదా? ఇక్కడ ఆన్సర్ తెలుసుకోండి..

ఏంటి బాస్ ఆ సీక్రెట్ 8ని కనిపెట్టలేకపోయారా? మరేం పర్వాలేదు. ఇక్కడ ఆన్సర్ తెలుసుకోండి. ఫోటోలోని డైమండ్స్ క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ డైమండ్స్ మధ్యలో గ్యాప్‌లను పరిశీలిస్తే 8 నెంబర్ క్లియర్‌గా కనిపిస్తుంటుంది. అదన్నమాట.. ఈ సీక్రెట్ 8 కథ. అయితే, దీనిని కనిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా, సహనం, ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఏ విధంగా చూసినా.. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పిక్స్ మనకు మేలే చేస్తాయి. సో.. వేట కొనసాగించండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..