AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Argentina Team: టైటిల్ గెలిచినప్పుడు ఆ మాత్రం ఉండాలిగా.. ఆకాశమే హద్దు అన్నట్లుగా సంబరాలు జరుపుకుంటున్న అర్జెంటీనా.. వైరల్ అవుతున్న లాకర్ రూమ్ వీడియో..

ఖతర్ వేదికగా జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2022 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ, అర్జెంటీనా జట్టు అభిమానులు హద్దే లేదన్నట్లుగాా సంబరాలు జరుపుకున్నారు. ఇక అభిమానులే ఆ స్థాయిలో జరుపుకుంటే, టైటిల్ గెలిచిన జట్టులోని సభ్యులు మిన్నకుంటారా..?

Argentina Team: టైటిల్ గెలిచినప్పుడు ఆ మాత్రం ఉండాలిగా.. ఆకాశమే హద్దు అన్నట్లుగా సంబరాలు జరుపుకుంటున్న అర్జెంటీనా.. వైరల్ అవుతున్న లాకర్ రూమ్ వీడియో..
Argentina Locker Room Celebrations
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 19, 2022 | 6:50 AM

Share

ఖతర్ వేదికగా జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2022 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ జట్టు మీద 4-2తో  అర్జెంటీనా జట్టు విజయం సాధించి టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఫలితంగా అర్జెంటీనా జట్టు మూడోసారి ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయం సాధించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెస్సీ, అర్జెంటీనా జట్టు అభిమానులు హద్దే లేదన్నట్లుగాా సంబరాలు జరుపుకున్నారు. ఇక అభిమానులే ఆ స్థాయిలో జరుపుకుంటే, టైటిల్ గెలిచిన జట్టులోని సభ్యులు మిన్నకుంటారా..? వారు కూడాా ఆకాశమే హద్దు అన్నట్లుగా సంబరాలలో మునిగితేలారు. ఇక వారి విజయోత్సవ వేడుకలకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది కూడా వారు తమ లాకర్ రూమ్‌లో జరుపుకుంటున్న సంబరాలకు సంబంధించిన వీడియోలు కావడంలో నెట్టింట ఎక్కడ చూసినా అర్జెంటీనా ప్లేయర్ల సంబరాలే కనిపిస్తున్నాయి. ఈ వైరల్ వీడియోలలో అర్జెంటీనా సారథి లియోనాల్ మెస్సీ సహా జట్టులోని ఇతర ఎంతో ఆనందంతో విజయోత్సవ సంబరాలను చేసుకుంటున్నారు.

ఇక అర్జెంటీనా జట్టు ఇప్పటి వరకు 1978, 1986 ఫీఫా ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలవగా ఈ సంవత్సరం మూడో సారి టైటిల్ విన్నర్‌గా రికార్డులకెక్కింది. దీంతో ప్రపంచకప్ గెలవాలన్న మెస్సీ కల కూడా నెరవేరింది. మరో వైపు ప్రపంచకప్ టోర్నీ ఫైనల్‌కు ముందుగానే.. తనకు ఇదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని అర్జెంటీనా కెప్టెన్ లియోనాల్ మెస్సీ ప్రకంటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం చాలా మంది ఫుట్‌బాల్ క్రిడాభిమానులతో పాటు, ఫుట్‌బాల్ ఆటగాళ్లను కూడా కలిచివేసిన వార్తగా మారింది. కాగా మెస్సీ ఇక నుంచి క్లబ్ ఫుట్‌బాల్‌లో ఆడుతూ కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న అర్జెంటీనాా లాకర్ రూమ్ వీడియో..

ఫ్రాన్స్ వర్సెస్ అర్జెంటీనా ఫీఫా ఫైనల్ మ్యాచ్

ఖతర్‌లోని లూసెయిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో లియోనాల్ సారథ్యంలోని అర్జెంటీనా  టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఆదివారం మెరిసింది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో అర్జెంటీనా  విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్‌ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి నిమిషం వరకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ముఖ్యంగా అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి.. మరోసారి అభిమానులను తన ఆట తీరుతో మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్‌ నింపాడు. అయితే క్రమక్రంగా బోర్డు 3-3తో సమంగా నిలవడంతో మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో మెస్సీ సేన నాలుగు గోల్స్‌ కొట్టగా.. ఫ్రాన్స్‌ రెండో గోల్స్‌​కు మాత్రమే సాధించగలిగింది. దీంతో అర్జెంటీనా జగజ్జేతగా అవతరించింది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..