Fruits For Diabetes: మధుమేహంతో బాధపడేవారికి మేలు చేసే పండ్లు ఇవే..

మధుమేహం సమస్యతో బాధపడేవారు తాము తీసుకునే ఆహారం విషయంలో ఎంతో అప్తమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌లో లేకపోతే.. కిడ్నీ వ్యాధులు.

Fruits For Diabetes: మధుమేహంతో బాధపడేవారికి మేలు చేసే పండ్లు ఇవే..
Fruits For Diabetics
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 18, 2022 | 3:46 PM

మధుమేహం సమస్యతో బాధపడేవారు తాము తీసుకునే ఆహారం, ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో అప్తమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్‌లో లేకపోతే.. కిడ్నీ వ్యాధులు, నరాల సమస్యలు, కంటి సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిక్‌ పేషెంట్స్‌కు తమ ఆహారం విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా పండ్లలో చక్కెరస్థాయి ఎక్కువగా ఉంటుందని.. అందువల్ల వాటిని తినకూడదని చాలామంది అనుకుంటారు. ఇంకా వాటిని తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందనే ఆందోళనలో ఉంటారు. అయితే డయాబెటిస్‌ ఉన్పప్పటికీ పండ్లు తినొచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నవారు గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అసలు డయాబెటిక్స్‌‌తో బాధపడేవారు ఏయే పండ్లు తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరెంజ్‌: ఆరెంజ్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్‌ లెవెల్ 40గా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ నిరభ్యంతరంగా వీటిని తినవచ్చు. ఇంకా ఆరెంజ్‌లో పుష్కలంగా ఉండే విటమిన్ సీ శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అంతేకాక ఎముకలు, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఆరెంజ్ సహాయపడుతుంది. జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ కూడా ఆరెంజ్‌లో సమృద్ధిగా ఉంటుంది.

బత్తాయి: బత్తాయిలో విటమిస్‌ సీ, పీచు, ఫోలెట్‌, పోటాషియం పుష్కలంగా ఉంటాయి. బత్తాయి గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 40-43గా ఉంటుంది. బత్తాయిలో పీచు అధికమొత్తంలో ఉండటం వల్ల వీటిని తిన్నా నెమ్మదిగా జీర్ణమై.. రక్తంలో కలవడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీంతో బత్తాయిలో ఉండే చక్కెర రక్తంలోని చక్కెరస్థాయిపై ప్రభావం చూపదు.

ఇవి కూడా చదవండి

చెర్రీస్: చెర్రీస్‌ను పోషకాల నిధి అని చెప్పుకోవచ్చు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్‌ 20 మాత్రమే ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉండదు. దీనిలో ఉండేే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌.. రోగనిరోధక వ్యవస్థను, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

స్ట్రాబెర్రీస్:  అన్ని రకాల బెర్రీలు షుగర్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి. వీటిలో ఇతర పండ్ల కంటే తక్కువ చక్కెర, ఎక్కువ ఫైబర్‌ ఉంటాయి. స్ట్రాబెర్రీ గ్రైసిమిక్‌ ఇండెక్స్‌ 41 మాత్రమే. ఇంకా దీనిలో ఆరెంజ్‌ కంటే ఎక్కువగా విటమిన్‌ సీ ఉంటుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చక్కెర చేరే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది.

యాపిల్‌: యాపిల్‌లో యాపిల్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI), గ్లైసెమిక్ లోడ్ స్కేల్స్ రెండూ తక్కువగా ఉంటాయి. వీటిని తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. యాపిల్‌లో ఉండే పీచు, పాలీఫినోల్స్‌.. కార్బోహైడ్రేట్ల శోషణను తగ్గిస్తాయి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిలువరిస్తాయి. యాపిల్‌లో చక్కెర ఉన్నా అది ఫ్రక్టోస్‌ రూపంలో ఉంటుంది. ఈ ఫ్రక్టోస్‌ రక్తంలోని చక్కెర స్థాయిపై పెద్దగా ప్రభావం చూపదు.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.