Amazon Prime India 2022: అమెజాన్ ప్రైమ్‌లో ఈ ఏడాది ఎక్కువగా చూసిన టాప్ 10 మూవీలు ఇవే.. మొదటి స్థానం నుంచి ‘తగ్గేదేలే’ అంటున్న టాలీవుడ్ మూవీ..
మరి కొద్ది రోజుల్లో 2022 సంవత్సరం పూర్తవబోతోంది. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక సినిమాలు విడుదలై సినీ ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు కొన్ని సినీ రికార్డులను తిరగరాశాయని చెప్పుకోవాలి. ఇక వీటిల్లో చాలా
మరి కొద్ది రోజుల్లో 2022 సంవత్సరం పూర్తవబోతోంది. ఈ ఏడాది భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక సినిమాలు విడుదలై సినీ ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు కొన్ని సినీ రికార్డులను తిరగరాశాయని చెప్పుకోవాలి. ఇక వీటిల్లో చాలా సినిమాలు అమెజాన్ ప్రైమ్ ఇండియాలో కూడా విడుదలయ్యాయి. మరి కొన్ని రోజులలో 2022 సంవత్సరం ముగిసి.. నూతన సంవత్సరంలోకి అడుగులు వేయనున్న వేళ అమెజాన్ ప్రైమ్ ఇండియా ఓ నివేదికను విడుదల చేసింది. అదేమిటంటే.. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఇండియాలో అత్యధికంగా చూసిన టాప్ 10 సినిమాల జాబితా. ఈ జాబితాలో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చిన పుష్ప మొదటి స్థానంలో ఉండగా, కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ 2 రెండో స్థానంలో ఉంది.
అసలు అమెజాన్ ప్రైమ్ ఇండియా విడుదల చేసిన టాప్ 10 సినిమాల జాబితాలోని పూర్తి వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1. పుష్ప: ది రైజ్
టాలీవుడ్ నుంచి ఈ ఏడాది విడుదలయిన సినిమాలలో పుష్ప పార్ట్ 1 అనేక రికార్డులను తిరగరాసింది. అల్లు అర్జున్, రష్మికా మందన్న హీరోహీరోయిన్లుగా వచ్చిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో కనిపించారు. 2022 సంవత్సరంలో అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలోపుష్ప: ది రైజ్ మొదటి స్థానంలో నిలిచింది.
2. కేజీఎఫ్: చాప్టర్ 2
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కేజీఎఫ్: చాప్టర్ 1కు సీక్వెల్. కన్నడ హీరో యష్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా తాండొన్, ప్రకాశ్ రాజ్ కూడా ప్రధాన పాత్రలలో నటించారు. 2022 సంవత్సరంలో అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో కేజీఎఫ్: చాప్టర్ 2 రెండో స్థానంలో ఉంది.
3. కేజీఎఫ్: చాప్టర్ 1
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్: చాప్టర్ 1 కన్నడ హీరో యష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా రాబట్టిన కలెక్షన్లను ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ మూవీలో అనంత్ నాగ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో కేజీఎఫ్: చాప్టర్ 1 మూడో స్థానంలో ఉంది.
4. సీతారామం
‘యుద్ధంలో పుట్టిన ప్రేమ’ అనే కాప్షన్‌తో వచ్చిన ఈ మూవీ దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో తొలి చిత్రమని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే సినిమా నచ్చనివారు ఉండనే ఉండరు. మంచి ఆదర్శవంతమైన ప్రేమకథతో సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఇక ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో సీతారామం నాలుగో స్థానంలో ఉంది.
5. పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1
మణిరత్నం డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రలలో నటించారు. ఇక సినిమా కథ ప్రేక్షకులను ఎంతగానో నచ్చిందని చెప్పుకోవాలి. 2022లో అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1 ఐదో స్థానంలో ఉంది.
6. బచ్చన్ పాండే
ఫర్హద్ సంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాలీవుడ్ మూవీలో అక్షయ్ కుమార్, కృతీ సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాది బాలీవుడ్ నుంచివిడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న అతి కొద్ది సినిమాలలో ఈ మూవీ కూడా ఒకటి. ఇక ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో బచ్చన్ పాండే ఆరో స్థానంలో ఉంది.
7. జగ్ జగ్ జీయో
రాజ్ మెహ్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనిల్ కపూర్, వరుణ్ ధావన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో చూసిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో జగ్ జగ్ జీయో ఏడో స్థానంలో ఉంది.
8. రన్‌వే 34
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించడమే కాక సినిమా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించారు. ఇక 2022లో అమెజాన్ ప్రైమ్ ఇండియాలో చూసిన టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో రన్‌వే 34 ఎనిమిదో స్థానంలో ఉంది.
9. జురాసిక్ వరల్డ్ డొమినీయన్
కోలిన్ ట్రెవోరో దర్శకత్వంలో వచ్చిన ఈ కార్టూన్ మూవీ కూడా ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ ఇండియాలో చూసిన టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో జురాసిక్ వరల్డ్ డొమినీయన్ తొమ్మిదో స్థానంలో ఉంది.
10. గెహ్రాయా
శకున్ బత్రా దర్శకత్వం వహించిన గెహ్రాయా మూవీలో దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే ప్రధాన పాత్రలలో నటించారు. ఇక 2022 అమెజాన్ ప్రైమ్ ఇండియాలో చూసిన టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో గెహ్రాయా పదో స్థానంలో ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.