Bigg Boss 6 Telugu: సూపర్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా వచ్చేది ఆ స్టార్ హీరోనేనా.?

ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు, సూట్ కేస్ తీసుకొని అమౌంట్ తో బయటకు ఎవరు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 6 Telugu: సూపర్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా వచ్చేది ఆ స్టార్ హీరోనేనా.?
Bigg Boss
Follow us

|

Updated on: Dec 18, 2022 | 3:02 PM

బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్ కు వచ్చేసింది నేడు (ఆదివారం) గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసి పోతుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు, సూట్ కేస్ తీసుకొని అమౌంట్ తో బయటకు ఎవరు వెళ్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హౌస్ లో ఉన్న వారిలో ఓట్ల ప్రకారం చూసుకుంటే రేవంత్ కు ఎక్కువ ఓటింగ్ ఉంది. కాబట్టి అతడే విన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ తర్వాత శ్రీహాన్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఇద్దరు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక బిగ్ బాస్ 6 ఫైనల్ కు గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్ట్ గా మారింది.

బిగ్ బాస్ ఫినాలే కు ముఖ్య అతిథిగా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ ప్లేస్ లో మరో హీరో రాబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సీజన్ కు గెస్ట్ గా వస్తున్న హీరో ఎవరు అన్నది ఇంతవరకు కన్ఫామ్ లేదు కానీ ఓ స్టార్ హీరో రాబోతున్నాడని మాత్రం టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు మాస్ మాహారాజా రవితేజ. ఫినాలే ను డబుల్ ఎనర్జీతో  నడిపించడానికి రవితేజ గెస్ట్ గా రానున్నదని అంటున్నారు.  మరో వైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తోంది.

అల్లు అర్జున్ బిగ్ బాస్ సీజన్ 6 కు గెస్ట్ గా హాజరు కానున్నాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ బిగ్ బాస్ సీజన్ ఫినాలే కు గెస్ట్ గా వస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది.

ఇవి కూడా చదవండి