Allu Arjun- Balakrishna: 2022 క్యాలెండర్ మిస్ చేసిన బన్నీ, బాలయ్య.. ఇక అంచనాలన్ని ఆ సినిమాలపైనే..

ఇద్దరు టాప్ స్టార్స్ మాత్రం ఈ క్యాలెండర్ ఇయర్‌ను స్కిప్‌ చేశారు. దీంతో ఆ హీరోల నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా..

Allu Arjun- Balakrishna: 2022 క్యాలెండర్ మిస్ చేసిన బన్నీ, బాలయ్య.. ఇక అంచనాలన్ని ఆ సినిమాలపైనే..
Balakrishna, Allu Arjun
Follow us

|

Updated on: Dec 17, 2022 | 4:36 PM

2022 ఎండింగ్‌కు వచ్చేయంటంతో ఈ ఏడాది సిల్వర్‌ స్క్రీన్ జర్నీని రీకాల్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. ముఖ్యంగా టాలీవుడ్‌లో అందరు హీరోలు వెండితెర మీద సందడి చేసినా.. ఇద్దరు టాప్ స్టార్స్ మాత్రం ఈ క్యాలెండర్ ఇయర్‌ను స్కిప్‌ చేశారు. దీంతో ఆ హీరోల నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి నటసింహం బాలకృష్ణ. గతేడాది ఎండిగ్‌లో పుష్పరాజ్‌గా వెండితెరను షేక్ చేశారు అల్లు అర్జున్‌. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన బన్నీ... ఆల్‌ టైమ్ రికార్డ్ సెట్ చేయటమే కాదు… నేషనల్ లెవల్‌లో భారీ హైప్‌ క్రియేట్ చేశారు. దీంతో పుష్ప సీక్వెల్ మీద అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు అందుకునేందుకు టైమ్ తీసుకున్న మేకర్స్‌ .. 2022 క్యాలెండర్ ఇయర్‌ను స్కిప్ చేశారు.

2022 అంతా పుష్ప 2 ప్రిపరేషనల్‌లోనే గడిపేశారు బన్నీ. ఇంతవరకు పుష్ప 2 షూటింగ్‌లో బన్నీ పాల్గొనలేదు. ఇమిడియట్‌గా షూటింగ్ స్టార్ట్ అయినా, భారీ చిత్రం కాబట్టి షూటింగ్ కే ఐదారు నెలల టైమ్ పడుతుంది. సో బన్నీని ఆడియన్స్‌ తెర మీద చూడాలంటే.. మినిమమ్‌ మరో 8 నెలలు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఫుల్ మాస్ క్యారెక్టర్ లో బన్నీ లుక్స్ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ ఏడాది క్యాలెండర్‌ను స్కిప్‌ చేసిన మరో స్టార్ హీరో బాలయ్య. 2021లో అఖండగా ఘన విజయం సాధించిన బాలయ్య… ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ నెక్ట్స్‌ సినిమాను పట్టాలెక్కించడానికి కాస్త టైమ్ తీసుకున్నారు. దీంతో బాలయ్య సినిమా క్యాలెండర్‌లో 2022 మిస్‌ అయ్యింది. అఖండ తరువాత షార్ట్ బ్రేక్‌ తీసుకొని వీర సింహారెడ్డి సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సినిమాను ఇయర్‌ ఎండింగ్‌లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసినా… సెంటిమెంట్‌ పరంగా సంక్రాంతి అయితే కలిసొస్తుందన్న నమ్మకంతో జనవరికి షిప్ట్ అయ్యారు. దీంతో 2022లో బాలయ్య నుంచి ఒక్క రిలీజ్ కూడా లేకుండాపోయింది.

వెండితెర మీద మిస్ అయినా… డిజిటల్‌ స్క్రీన్స్‌ ద్వారా ఆడియన్స్‌తో టచ్‌లోనే ఉన్నారు నందమూరి నటసింహం. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్‌స్టాపబుల్ బాలయ్యను అభిమానులకు మరింత చేరువ చేసింది. దీంతో ఫ్యాన్స్‌ ఏ మాత్రం గ్యాప్ ఫీల్‌ అవ్వటం లేదు.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో