AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Namrata Shirodkar: ‘వారి వల్లే మా మధ్య గొడవలు జరుగుతుంటాయి’.. మహేష్ సతీమణి నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత.. తన ఫ్యామిలీ విషయాలే కాకుండా కెరీర్‏కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "మహేష్ బాబు నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన రోజు అది" అని అన్నారు నమ్రత.

Namrata Shirodkar: 'వారి వల్లే మా మధ్య గొడవలు జరుగుతుంటాయి'.. మహేష్ సతీమణి నమ్రత ఆసక్తికర వ్యాఖ్యలు..
Namrata, Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2022 | 2:50 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ లో మహేష్ బాబు.. నమ్రత ఒకరు. వీరు ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్‏గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. మరోవైపు నమ్రత పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. పిల్లలు గౌతమ్, సితారలను చూసుకుంటూ ఘట్టమనేని ఇంటి బాధ్యతలు.. వ్యాపార విషయాలను చూసుకుంటుంటున్నారు. ముఖ్యంగా మహేష్ జీవితంలో నమ్రత పాత్ర ప్రత్యేకం. ఎప్పుడూ బయట కనిపించిన మహేష్ సతీమణి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత.. తన ఫ్యామిలీ విషయాలే కాకుండా కెరీర్‏కు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. “మహేష్ బాబు నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితంలోనే ఎంతో సంతోషకరమైన రోజు అది” అని అన్నారు నమ్రత.

“సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్ చేశాను. కొద్దిరోజులుగా మోడలింగ్ బోర్ కొట్టడంతో సినిమా పరిశ్రమ వైపు వచ్చాను. నటిగా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశాను. అప్పుడే మహేష్ ను కలిశాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. కాబోయే సతీమణి ఎలా ఉండాలనే విషయంలో తనకు స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యాను. పెళ్లి అయ్యాక కూడా నాకు అవకాశాలు వచ్చాయి. కాకపోతే నటించాలనే ఉద్ధేశం లేదు.

ఇక మా ఇద్దరి మధ్య అసలు గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుంది. పిల్లలు తమకు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతుంటారు. ఆయన కాదు అనరు. నేను నో చెబుతుంటాను. అలా మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి ” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మహేష్ నటించిన సినిమాల్లో తనకు పోకిరి అంటే చాలా ఇష్టమని.. ఆ మూవీలో బుల్లెట్ దిగిందా లేదా అనే పంచ్ డైలాగ్ తనకు నచ్చిందని చెప్పుకొచ్చారు.