Raviteja: ధమాకాలో రవితేజ డ్యూయల్ క్యారెక్టర్ ?..సింగిల్ క్యారెక్టర్ ఉంటుందా ?.. ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..

రవితేజ మాస్ యాక్షన్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ ప్రకారం ఈ సినిమా ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.

Raviteja: ధమాకాలో రవితేజ డ్యూయల్ క్యారెక్టర్ ?..సింగిల్ క్యారెక్టర్ ఉంటుందా ?.. ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్..
Raviteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2022 | 3:50 PM

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ధమాకా. డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన రూపొందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23, 2022 న విడుదలకు సిద్ధంగా ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. మరోవైపు రణవీర్ సింగ్ నటించిన “సర్కస్” కూడా అదే రోజు విడదల కాబోతుండడంతో బీటౌన్ బాక్సాఫీస్ వద్ద క్లాష్ జరగనుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో పంచ్ డైలాగ్స్.. రవితేజ మాస్ యాక్షన్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ ప్రకారం ఈ సినిమా ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. దీంతో ఇందులో మాస్ మాహారాజా కేవలం సింగిల్ రోల్ ? లేదా డ్యూయల్ రోల్ ఉందా ?అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నివేదికల ప్రకారం.. ధమాకా టైటిల్‌తో రూపొందించబడిన ఈ చిత్రంలో రవితేజ యొక్క డ్యూయల్ క్యారెక్టర్ కాదని.. ఒక హీరో పాత్ర మాత్రమే ఉందని తెలుస్తోంది. ఇది కేవలం ఒకే రోల్ క్యారెక్టర్ తప్ప మరెవరూ పోషించలేదు. ఇది సింగిల్ రోల్ కాదు డబుల్ రోల్. డ్యూయల్ క్యారెక్టర్‌గా చిత్రీకరిస్తున్నారు. ధమాకా జరిగే వరకు, తెరపై, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా ఆశ్చర్యపోతారని అన్నారు ప్రొడ్యూసర్ అభిషేక్.

ప్రస్తుతం రవితేజ ధమాకా చిత్రంలో హిందీలో డబ్ చేయబడుతుంది. అలాగే ఆయన నటిస్తోన్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం హిందీలోనూ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగి శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది. రవితేజ మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా స్వాగతిస్తారని భావిస్తున్నాను అని అన్నారు.

ఇక క్రాక్ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మాస్ మాహారాజా… చాలా కాలం తర్వాత ఫుల్ టైమ్ మాస్ యాక్షన్ చిత్రంతో క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయబోతున్నారు. అంతేకాకుండా.. మొదటి సారి రవిజేత సినిమా హిందీలో రిలీజ్ కాబోతుండడంతో నార్త్ ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.